XP లో కూడా Vista ఫీచర్స్ పొందవచ్చు. దీనిని సంబంధించి నెట్ లో ఎన్నో సాప్ట్ వేర్లు దొరుకుతున్నాయి. ఇంతకు ముందు టపా లో సైడ్ బార్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు XP లో మిగతా Vista ఫీచర్స్ ఎలా పొందాలో చూద్దాం...
1.టాస్క్ బార్ విసుఅల్ టిప్స్ (Taskbar Visual Tips):
Taskbar Visual Tips - టాస్క్ బార్ మీద వున్న విండోల చిన్న ప్రివ్యూ. టాస్క్ బార్ మీద వున్న ఐటమ్ ల మీద మౌస్ పాయింటర్ వుంచితే దానిని సంబంధించిన చిన్న విండో కనపడుతుంది. Visual Tool Tips సాప్ట్ వేర్ ని http://www.chrisnsoft.com/visual-tooltip/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
2.విస్టా లుక్ కోసం (XP Themes):
custom Themes XP లో పనిచేయటానికి ముందుగా UXTHEME patch ఫైల్ ని http://www.softpedia.com/progDownload/UXTheme-MultiPatcher-Download-2369.html నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్యాచ్ ని రన్ చేసేటప్పుడు విండోస్ ఫైళ్ళను రిప్లేస్ చేస్తాననే వార్నింగులను క్యాన్సిల్ చెయ్యాలి. సిస్టం రీస్టార్ట్ చేసి కస్టమైజ్డ్ థీమ్స్ వాడుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన థీమ్ ఫైల్ ని C:\Windows\Resources\Themes లో సేవ్ చేయండి. Display Properties విండో కి వెళ్ళి థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. థీమ్స్ కోసం www.themexp.org మరియు www.deviantart.com చూడండి.
3.విస్టా స్టార్ట్ మెనూ (Vista Start Menu):
విస్టా స్టార్ట్ మెనూ ఏమ్యులేటర్ ని http://fogelsoft.extra.hu/forum/ లేదా http://lee-soft.com/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
4.ప్లిప్పింగ్ విండోస్ (Flipping Windows):
టాప్ డెస్క్ అనే యుటిలిటీ మల్టీటాస్కింగ్ కి వుపయోగపడుతుంది. దీనిని http://www.otakusoftware.com/topdesk/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టాప్ డెస్క్ ఇనస్టలేషన్ చేసిన తర్వాత [Windows Key]+[Tab] కీ లను ప్రెస్ చేస్తే రన్ అవుతున్న అప్లికేషన్ల అన్నిటినీ ఓపెన్ చేసి చూపిస్తుంది. కావలసిన అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
5.ఫెర్ఫార్మెన్స్ బూస్టర్ (Performance Booster):
విస్టా లో USB Flash drive ని అదనపు మెమొరీ గా వుపయోగించుకోవచ్చు. XP లో ఆ ఫీచర్ ని పొందాలంటే బూస్టర్ సాప్ట్ వేర్ ని www.eboostr.com నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ కాదు.