Friday, July 4, 2008

XP లో Vista ఫీచర్స్ - సైడ్ బార్ (Google Desktop)


విస్టా వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా ఎక్కువ మంది యూజర్లు ఎక్స్పీ నే వుపయోగించటానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏదైనా విస్తా ఫీచర్స్ మాత్రం ఎక్స్పీ లో పొందాలనుకొంటున్నారు. విస్టా ప్రొడక్టివిటీ ఫీచర్స్ లో సైడ్ బార్ ఆకర్షణీయమైనది. వాతావరణ, వార్తలు, సమయం, మెయిల్ మెదలగు విషయాలకు సంభందించిన ఇనస్టంట్ ఇన్ఫర్ మేషన్ కోసం సైడ్ బార్ వుపయోగపడుతుంది. XP లో కూడా సైడ్ బార్ పొందాలంటే నెట్ లో ఎన్నో సాప్ట్ వేర్లు లభిస్తున్నాయి వాటిలో ఒకటే Google Desktop. దీనిని http://desktop.google.com నుండి వుచితం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ చేసిన తర్వాత సిస్టం ట్రే లో వున్న Google Desktop ఐకాన్ మీద మౌస్ రైట్ క్లిక్ చేసి సైడ్ బార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు XP లో Vista సైడ్ బార్ రెఢీ... సైడ్ బార్ లో + గుర్తు మీద క్లిక్ చేసి గాడ్జెట్లు యాడ్ చేసుకోవచ్చు.

Google Desktop సైడ్ బార్ గా మాత్రమే కాకుండా ఫైల్ ఇండెక్సింగ్ కు మరియు సెర్చ్ చెయ్యటానికి కూడా వుపయోగపడుతుంది. సిస్టం లో ఫైల్స్ ని సెర్చ్ చెయ్యటానికి, సైడ్ బార్ పై క్లిక్ చేసి [Ctrl] కీ రెండు సార్లు ప్రెస్ చేస్తే Google సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ విండోస్ సెర్చ్ కన్నా వేగంగా పనిచేస్తుంది. ఇది కాకుండా సైడ్ బార్ లో వున్న టెక్స్ట్ ఫీల్డ్ ని కూడా వుపయోగించుకోవచ్చు.

ఢన్యవాదాలు