USB Drive పనితనాన్ని మెరుగుపర్చటం ఎలా?
USB Drive పనితనాన్ని మెరుగుపర్చటానికి ఈ విధంగా చెయ్యండి. ముందుగా USB Drive ని ప్లగ్ ఇన్ చెయ్యాలి, ’My Computer' ఓపెన్ చేసి, USB Drive పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి. ’Properties' లోని ’Hardware' టాబ్ లో USB Drive ని సెలెక్ట్ చేసుకొని, క్రిందవున్న ’Properties' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో ’Policies' టాబ్ లో ’Optimize for Performance' అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ’OK' బటన్ పై క్లిక్ చెయ్యాలి. USB Drive ని తొలగించి మరల ఇన్సర్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా ఫైల్ ని USB Drive లోకి కాపీ చెయ్యండి, కాపీ అవటానికి పట్టే సమయం తగ్గటం మీరు గమనిస్తారు.ధన్యవాదాలు