Thursday, June 25, 2009

'Not Responding' ప్రోగ్రాములను టెర్మినేట్ (అంతం) చెయ్యండిలా....

విండోస్ యూజర్లకి పరిచయమున్న మెసేజ్ ’Not Responding'... ఏదైనా ప్రోగ్రాములు రన్ చేస్తున్నప్పుడు అవి రెస్పాండ్ కావటానికి ఎక్కువ సమయం పట్టినప్పుడు ’Not Responding' అనే మెసేజ్ వస్తుంది, అప్పుడు అది ఏ కమాండ్లను తీసుకోదు, దానంతట అదే ఓపెన్ అవ్వటమో లేదా క్లోజ్ అవ్వటమో జరుగుతుంది. ఇది కొద్దిగా చిరాకు తెప్పించే మెసేజ్... అలాంటప్పుడు Task Manager కి వెళ్ళి సరైన ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకొని దానిని ’End Process' చేస్తాము. అలాకాకుండా డెస్క్ టాప్ పై క్రింద చెప్పిన విధంగా ఒక ఐకాన్ క్రియేట్ చేసుకుంటే అదే ఆటోమాటిక్ గా రెస్పాండ్ కాని ప్రాసెస్ లను కనుగొని ఆ ప్రాసెస్ ని అంతం చేస్తుంది.

౧. ముందుగా Desktop పై రైట్ క్లిక్ చేసి New ---> Shortcut పై క్లిక్ చెయ్యాలి.

౨. ఓపెన్ అయిన Create Shortcut విండోలో Type the location of the item: దగ్గర ఈ విధంగా taskkill.exe /f /fi “status eq not responding” టైప్ లేదా దీనినే కాపీ చేసి పేస్ట్ చెయ్యాలి.



౩. తర్వాత ’Next' బటన్ పై క్లిక్ చేసి Shortcut కి ఒక పేరు పెట్టుకొని ’Finish' బటన్ క్లిక్ చెయ్యాలి. అంతే షార్ట్ కట్ రెడీ...ఇక ఎప్పుడైనా ’Not Responding' అని వస్తే దానిని క్లోజ్ చెయ్యటానికి ఈ షార్ట్ కట్ ని ఉపయోగించవచ్చు.

ఈ చిట్కా Windows XP Professional, అన్ని Windows Vista versions మరియు Windows 7 లలో పనిచేస్తుంది కాని XP Home Edition లో పని చేయదు.

Windows XP Home Edition లో ’Not Responding' ప్రోగ్రాములను అంతం చెయ్యటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. Notepad ఓపెన్ చేసి క్రింద యివ్వబడిన కోడ్ ని కాపీ చెయ్యాలి:

@echo off
taskkill.exe /f /fi “status eq not responding”
exit

౨. నోట్ పాడ్ ఫైల్ ని File ---> Save కి వెళ్ళి Taskkill.bat ఫైల్ గా సేవ్ చేసుకోవాలి. బ్యాచ్ ఫైల్ క్రియేట్ అవుతుంది, దీనిని ఊపయోగించి Windows XP Home Edition లో ’Not Responding' ప్రోగ్రాములను అంతం చెయ్యవచ్చు.

ధన్యవాదాలు