Monday, June 22, 2009

SKTimeStamp - ఫైల్ క్రియేషన్ డేట్స్ మార్చటానికి...

ఏదైనా ఫైల్ యొక్క Created, Modified మరియు Accessed ల timestamp లను మార్చటానికి SKTimeStamp అనే ఎక్స్ ప్లోరర్ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది. ముందుగా SKTimeStamp ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. తర్వాత Created, Modified మరియు Accessed ల timestamp లను మార్చవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని దానిపై రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ ప్రోపర్టీస్ లో ’TimeStamps' టాబ్ పై క్లిక్ చెయ్యాలి. డ్రాప్ డౌన్ యారో ఉపయోగించి డేట్ మార్చవచ్చు అలాగే అప్ అండ్ డౌన్ యారో లను ఉపయోగించి సమయాన్ని కూడా మార్చుకోవచ్చు. ముందుగా ’Apply' తర్వాత ’Ok' బటన్ పై క్లిక్ చేసి మార్పులను సేవ్ చేసుకోవచ్చు.




ఇప్పుడు అదే ఫైల్ పై రైట్ క్లిక్ చేసి ’Properties' కి వెళ్ళి మారిన తారీఖు లను చూడవచ్చు. ఫైల్ ప్రోపర్టీస్ లో ’TimeStamps' టాబ్ పై క్లిక్ అక్కడవున్న ’Touch' బటన్ పై క్లిక్ చేస్తే 'Last Modified:' అప్పటి (current) తారీఖు మరియు సమయానికి మార్చబడుతుంది.

ధన్యవాదాలు