Monday, June 22, 2009

Fast Duplicate File Finder - సిస్టం లోని డూప్లికేట్ ఫైళ్ళను కనుక్కోవటానికి...

స్టాండ్ ఎలోన్ సిస్టం లేదా నెట్ వర్క్ లోని ఏదైనా సిస్టం లో డూప్లికేట్ ఫైళ్ళను కనుక్కోవటానికి... Fast Duplicate File Finder అనే చిన్న అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఫైల్ డౌన్లోడ్ సైజ్ 1.53 మాత్రమే. ఈ పోగ్రామ్ డౌన్లోడ్ చేసి... ఇనస్టలేషన్ చేసి ... రన్ చేస్తే మెయిన్ విండో ఈ క్రింది విధంగా వుంటుంది:




ఏ ఫోల్డర్ లో అయితే డూప్లికేట్ ఫైళ్ళను వెతకాలనుకుంటున్నామో ... మెయిన్ విండోలోని ’Add Folder' బటన్ పై క్లిక్ చేసి ఆ ఫోల్డర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువ ఫోల్డర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేని ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకొని ’Remove Folder' బటన్ పై క్లిక్ చేసి దానిని తొలగించవచ్చు.

ఇప్పుడు ’Start Scan' బటన్ ప్రెస్ చెయ్యాలి. సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లు స్కాన్ చేసి డూప్లికేట్ ఫైళ్ళ లిస్ట్ వస్తుంది. ఆటోమాటిక్ గా డూప్లికేట్ ఫైళ్ళు చెక్ చెయ్యబడి వుంటాయి లేదంటే ’Auto Check' బటన్ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఫైళ్ళను తెలుసుకోవచ్చు. check చెయ్యబడిన ఫైళ్ళను వేరొక చోటికి మూవ్ చెయ్యటం లేదా డిలీట్ చెయ్యవచ్చు.

మరింత సమాచారం మరియు ట్యుటోరియల్ కోసం Fast Duplicate File Finder సైట్ ని సందర్సించండి.

ఈ అప్లికేషన్ Windows 98 నుండి Windows 7 వరకు అన్నిటిలో పని చేస్తుంది.



ధన్యవాదాలు