Monday, June 8, 2009

Windows Hider - ఓపెన్ అయి వున్న విండోస్ ని వేగంగా దాచి పెట్టటానికి మరియు కిల్ చెయ్యటానికి....

మీరు ఇంటర్నెట్ లో మీకు నచ్చిన సైట్లు చూస్తున్నారు లేదా గేమ్స్ ఆడుతున్నారు... ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి కంటా పడకుండా ఆ విండోలను త్వరగా దాచి పెట్టాలన్నా లేదా వాటిని కిల్ చెయ్యాలన్నా ... దానికి ఒక ఉపాయం వుంది...అదే Windows Hider ...ఈ చిన్న మరియు ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి ప్రాసెసెస్ కి మీకు సులువుగా వుండే షార్ట్ కట్ కీలను పెట్టి వాటిని హైడ్ లేదా కిల్ చెయ్యవచ్చు.



’Add' బటన్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే ’Add New Process' విండోలో కుడి చేతి ప్రక్కవున్న ఐకాన్ ని మౌస్ తో డ్రాగ్ చేసి కావలసిన విండో టాప్ పై వుంచితే దాని ప్రాసెస్ మరియు టైటిల్ ఆటోమాటిక్ గా అక్కడ వస్తాయి. తర్వాత ’OK' బటన్ పై ప్రెస్ చెయ్యాలి. అంతే ప్రాసెస్ యాడ్ చెయ్యబడుతుంది. ’Edit' బటన్ ను ఉపయోగించి ఎడిట్ చేసుకోవచ్చు.



కావల్సిన ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకొని ’Hide' లేదా ’Show' బటన్లను ఉపయోగించి దాచిపెట్టవచ్చు లేదా దాచిపెట్టిన వాటిని తిరిగి పొందవచ్చు.

లేదంటే మీ సొంత షార్ట్ కట్ కీ లు ఉపయోగించి హైడ్ లేదా కిల్ చెయ్యాలంటే ...ముందుగా ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని ’Settings' బటన్ పై క్లిక్ చెయ్యాలి ...ఓపెన్ అయిన సెట్టింగ్స్ విండోలో మీకు నచ్చిన కీ లను మరియు వాటి కాంబినేషన్లను ప్రెస్ చేస్తే ఆటోమాటిక్ గా అక్కడ వస్తాయి.



ఇంకెందుకు ఆలశ్యం Windows Hider డౌన్లోడ్ చేసుకోండి మీ బాస్ కంట పడకుండా మీ నచ్చిన ప్రోగ్రాములు రన్ చెయ్యండి.

ధన్యవాదాలు