Tuesday, June 30, 2009

BSNL GPRS సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చెయ్యటం ఎలా?

మీరు BSNL - CellOne కస్టమర్లు అయ్యి, మీ మొబైల్ ఫోన్ లో General Packet Radio Service (GPRS) సదుపాయం వుంటే కనుక దానిని ఎలా కాన్ఫిగరేషన్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం:

౧.GPRS యాక్టివేషన్:

ముందుగా GPRS యాక్టివేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ నుండి ప్రీపెయిడ్ కస్టమర్లు GPRSPRE అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి అదే పోస్ట్ పెయిడ్ అయితే GPRS49 లేదా GPRS123 (ఇక్కడ 49 లేదా 123 ఇవి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్) అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.

౨. GPRS సెట్టింగ్స్ డౌన్లోడ్:

24 గంటల్లో GPRS యాక్టివేట్ చెయ్యబడుతుంది. తర్వాత సెట్టింగ్స్ డౌన్లోడ్ కోసం Mobile Make ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి MobileModelno ఎంటర్ చేసి 58355 కి SMS పంపాలి. ఉదాహరణకి మీరు SAMSUNG mobile make మరియు E1410 MobileModelno వాడుతుంటే కనుక SAMSUNG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి E1410 అని టైప్ చేసి 58355 కి SMS పంపాలి.

౩. GPRS సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్:
సెట్టింగ్స్ మొబైల్ ఫోన్ కి డౌన్లోడ్ అయిన తర్వాత వాటిని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఆ సమయంలో సెక్యూరిటీ PIN అడుగుతుంది అక్కడ 1111 ఎంటర్ చెయ్యాలి.

అంతే మీ మొబైల్ ఫోన్ లో GPRS కాన్ఫిగర్ చెయ్యబడింది. ఇంటర్నెట్ చూసుకోవచ్చు, MMS లు కూడా పంపుకోవచ్చు. GPRS యాక్టివేషన్ ఉచితం.

GPRS డీయాక్టివేట్ చెయ్యటానికి:

౧.ప్రీ పెయిడ్ కస్టమర్లు GPRSDE అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.
౨.పోస్ట్ పెయిడ్ కస్టమర్లు GPRSDC అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.

ధన్యవాదాలు