మన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్/ ఆపరేటర్ అందించే సేవలు సరిగా లేనప్పుడు (సిగ్నల్ స్రిగా లేకపోవటం, బిల్లింగ్ సమస్యలు, ఎక్కువ ఆఫర్లు లేకపోవటం మొదలగునవి)వేరే ఆపరేటర్ కి మరుతూవుంటాం. ఒక్కొక్కసారి మొబైల్ ఫోన్ నంబరు (ఫ్యాన్సీ) బాగుండి, కొంతకాలంగా వాడుతూ బంధుమిత్రులకు ఆ నంబర్ యిచ్చి సడన్ గా వేరే నంబరా అని ఆలోచించి ఇబ్బందులు వున్నా పాత దానితోనే అడ్జస్ట్ అయిపోతూ వుంటాం. ఇప్పుడు ఆ సమస్య లేదు మన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నంబర్ పోర్టబిలిటీ నవంబర్ 1 వ తారీకు నుండి అమలులోకి రానుంది. నంబర్ పోర్టబిలిటీ అంటే మన మొబైల్ నంబరు మార్చకుండా మనకు నచ్చిన ఆపరేటర్ దగ్గరకు వెళ్లవచ్చు (మార్చుకోవచ్చు).
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ గురించి Telecom Regulatory Authority of India (TRAI) చైర్మన్ Dr J. S. Sarma హిందూ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్యూ ఇక్కడ చూడండి.

ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా నంబర్ పోర్టబిలిటీ నవంబర్ 1 నుండి అమలులోకి వస్తుందని ఆశిద్దాం!!!! దీనికోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ధన్యవాదాలు