Thursday, September 16, 2010

FixPicture.org - ఆన్‌లైన్ లో ఇమేజెస్ ని రీసైజ్ చెయ్యటానికి !!!

FixPicture.org సైట్ కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఇమేజ్ లను అప్‌లోడ్ చేసి ఇమేజ్ సైజ్ ని పెంచటం లేదా తగ్గించటం చెయ్యవచ్చు. అంతేకాకుండా క్రాప్, రొటేట్, బ్లర్, గ్రేస్కేల్, కలర్ అడ్జస్ట్‌మెంట్ టూల్స్ ఉన్నాయి. మార్పులు చేర్పులు చేసిన తర్వాత తిరిగి మన హార్డ్‌డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు.



FixPicture.org సైట్ కి వెళ్ళగానే రెండు ఆప్షన్లు వస్తాయి ఒకటి FLASH VERSION మరొకటి HTML VERSION. FLASH VERSION చక్కని ఇంటర్‌ఫేజ్ ని కలిగివుంటుంది, కాబట్టి FLASH VERSION ఆప్షన్ ని ఎంచుకోండి. IMPORT IMAGE లో వున్న [Browse your hard drive] పై క్లిక్ చేసి ఇమేజ్ ని అప్‌లోడ్ చెయ్యాలి. కేవలం రీసైజ్ మాత్రమే చెయ్యాలనుకొంటే కనుక పైన వున్న + లేదా - గుర్తులపై క్లిక్ చెయ్యాలి. ఇమేజ్ టచ్అప్ టూల్స్ కావాలంటే కనుక క్రిందవున్న BASIC TOOLS, EFFECTS లో వున్న టూల్స్ ని ఉపయోగించుకోవచ్చు. Undo, Redo ఆప్షన్లు వున్నాయి. అలానే చివరగా [Save Image to Disk] బటన్ పై క్లిక్ చేసి ఇమేజ్ ని మన హార్డ్‌డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్:FixPicture.org

ధన్యవాదాలు