Wednesday, September 8, 2010

Nitro PDF Reader - పీడీఎఫ్ రీడర్, క్రియేటర్, టెక్స్ట్ కన్వర్టర్, ఇంకా ఎన్నో ....

ఏదైనా అప్లికేషన్ (Word, Excel, Powerpoint మొ.) ఫైళ్ళను పీడీఎఫ్ ఫైళ్ళగా మార్చటానికి నెట్ లో చాలా పీడీఎఫ్ క్రియేటర్ అప్లికేషన్స్ దొరుకుతున్నాయి, అలానే పీడీఎఫ్ ఫైళ్ళను చదవటానికి రీడర్లు మరియు పీడీఎఫ్ ఫైళ్ళను టెక్స్ట్ లోకి మార్చటానికి ... యిలా వివిధ అప్లికేషన్ల ను మన అవసరాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగిస్తూ ఉంటాం. అలా కాకుండా పైన చెప్పిన వాటితో పాటు యింకా ఎన్నో ఫీచర్లు కలిగిన అప్లికేషన్ గురించి తెలుసుకోవాలా ... అదే... Nitro PDF Reader ... ఇది కేవలం రీడర్ మాత్రమే కాదు...ఎన్నో ఫీచర్లు వున్నాయి. Nitro PDF Reader ని ఉపయోగించి 300 పైగా ఫైల్ ఫార్మేట్లను పీడీఎఫ్ ఫైళ్ళగా మార్చవచ్చు. ఫీడీఎఫ్ ఫైల్ గా మార్చవలసిన ఏదైనా ఫైల్ ని డ్రాగ్ చేసి డెస్క్‌టాప్ పైన్ వున్న Nitro PDF Reader షార్ట్‌కట్ పై డ్రాప్ చేస్తే ఆ ఫైల్ పీడీఎఫ్ ఫైల్ గా మార్చబడుతుంది. అలా కాకుండా ప్రింట్ డైలాగ్ ఆప్షన్ ద్వారా కూడా పీడీఎఫ్ ఫైల్ గా మార్చవచ్చు. ఫీడీఎఫ్ ఫైల్ లోని కంటెంట్ ని టెక్స్ట్ లోకి మార్చుకోవచ్చు మరియు ఇమేజ్ లను వేరుగా సేవ్ చేసుకోవచ్చు. Nitro PDF Reader లోని కొన్ని టూల్స్ ని ఉపయోగించి పీడీఏఫ్ డాక్యుమెంట్ లో ఎక్కడైనా టెక్స్ట్ ని యాడ్ చెయ్యవచ్చు, టెక్స్ట్ ని హైలైట్ చెయ్యవచ్చు, నోట్స్/కామెంట్స్ జతచెయ్యవచ్చు. పీడీఎఫ్ ఫార్మ్స్ ని నింపి సేవ్ చేసుకోవచ్చు మరియు వాటికి సిగ్నేచర్ జతచెయ్యవచ్చు.


Nitro PDF Reader ని చూడండి:



డౌన్లోడ్ మరియు యితర సమాచారం కోసం Nitro PDF Reader సైట్ చూడండి.

ధన్యవాదాలు