BrainShark సైట్ కి వెళ్ళి మీ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లను అప్లోడ్ చేసి అవసరమైన చోట వాయిస్/ ఆడియో/మ్యూజిక్, డాక్యుమెంట్లు, వీడియో ని జతచేసి ఆకర్షణీయమైన మల్టీమీడీయా ప్రెజెంటేషన్లను తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న ప్రెజెంటేషన్లను వీడియో ఫైళ్ళగా (.MP4, .3GP, .WMV) డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే యూట్యూబ్ లో అప్‍లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెయ్యటం కోసం ముందుగా BrainShark సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. చిన్న వ్యాపారులు తమ ప్యాపార అవసరాలకు, విద్యార్ధులు/టీచర్లు ఎడ్యుకేషన్ కి సంబంధించిన మల్టీమీడీయా ప్రెజెంటేషన్లను ప్రిపేర్ చేసుకోవటం లో BrainShark సహాయపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి BrainShark లో డైరెక్ట్ గా ప్రెజెంటేషన్లు తయారుచేసుకోలేం, ముందుగా పవర్‌పాయింట్ లో లేదా వేరే విధంగా చేసుకొన్న ప్రెజెంటేషన్లను అప్లోడ్ చేసి మాత్రమే పైన చెప్పిన విధంగా చెయ్యవచ్చు.
BrainShark కి సంబంధించిన Quick Tour ఇక్కడ చూడండి:
వెబ్‌సైట్: BrainShark
ధన్యవాదాలు