ఉపాధ్యాయులు, వెబ్ ట్యూటర్లు పీసీ స్క్రీన్ రికార్డ్ చేసి వీడీయో ట్యుటోరియల్స్ తయారుచెయ్యటానికి Koyote Free Screen To Video అనే ఉచిత సాప్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ముందుగా Koyote సైట్ కి వెళ్ళి Free Screen To Video అనే సాప్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.
మెయిన్ అప్లికేషన్ ఇంటర్‌ఫేజ్ ఈ క్రింది విధంగా వుంటుంది:
ఇక్కడ క్రింద చూపిన విధంగా వీడీయో అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకోవాలి.
స్క్రీన్ రికార్డింగ్ మెదలు పెట్టేముందు Screen Capure బటన్ పై క్లిక్ చేసి కాప్చర్ చెయ్యవలసినది మొత్తం పీసీ స్క్రీన్ లేదా కావలసిన విండో లేదా కావలసిన ఏరియానా అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు Start బటన్ పై క్లిక్ చేస్తే రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది మరియు అవుట్‌పుట్ సేవ్ చెయ్యటానికి సేవ్ విండో ఓపెన్ అవుతుంది, కావలసిన ఫైల్ పేరు ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి.
ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఆటోమాటిక్ గా రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది మరియు ఐకాన్ సిస్టం ట్రేలో కూర్చుంటుంది. Stop చెయ్యటానికి [F10] బటన్ Pause చెయ్యటానికి [F9] బటన్ ప్రెస్ చెయ్యాలి.
తిరిగి మెయిన్ అప్లికేషన్ కి వెళితే రికార్డ్ చెయ్యబడిన ఫైళ్ళ లిస్ట్ కనబడుతుంది, కావలసిన దానిపై డబల్ క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది. లేదంటే వీడీయో ఫైల్ సేవ్ చెయ్యబడిన లొకేషన్ కి వెళ్ళి మాన్యువల్ గా కూడా ప్లే చేసుకోవచ్చు.
స్క్రీన్ కాప్చర్ చేసేటప్పుడు మౌస్ పాయింటర్ కనబడకుండా వుండటానికి మెయిన్ మెనూ లో Mouse బటన్ పై క్లిక్ చేసి Don't Capture Mouse ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
అంతేకాకుండా ఆడియో కూడా కాప్చర్ చేసే సదుపాయం కూడా కలదు, దానికోసం మెయిన్ మెనూ లో Configuration బటన్ పై క్లిక్ చెయ్యాలి.
డౌన్లోడ్: Koyote Free Screen To Video
ధన్యవాదాలు