Tuesday, July 21, 2009

Animoto - ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో లు తయారుచేసుకోవటానికి ఉచిత ఆన్ లైన్ టూల్

డిజిటల్ ఫోటో లు చూసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదా... అయితే ఎందుకు ఆలశ్యం animoto సైట్ కి వెళ్ళి మీ ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో స్లైడ్ షో తయారుచేసుకోండి, అదీ సులభంగా... ముందుగా animoto సైట్ కి వెళ్ళి ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి . తర్వాత ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. ’Create Video' పై క్లిక్ చేయ్యాలి. Choose your video type లో animoto short ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఫ్రీ. మన సిస్టం నుండి కాని, flickr, facebook, picasa మొ. సైట్ల నుండి కాని ఇమేజెస్ ని అప్ లోడ్ చెయ్యాలి. ఫోటోలకు కావాలంటే టెక్స్ట్ యాడ్ చెయ్యవచ్చు. తర్వాత ’Continue' పై క్లిక్ చెయ్యాలి.

౨. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చెయ్యాలి, మ్యూజిక్ ఫైల్ మన సిస్టం నుండి కాని లేదా animoto సైట్ నుండి కాని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ’Save & Continue' పై క్లిక్ చెయ్యాలి.

౩. ఇక్కడ speed సెలెక్ట్ చేసుకొని ’Continue' పై క్లిక్ చెయ్యాలి. టైటిల్, డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి ’Create Video' పై క్లిక్ చెయ్యాలి.

Processing ----> Analyzing -----> Rendering పూర్తి అయిన తర్వాత వీడియో రెడీ అవుతుంది. దానిని ప్లే చేసుకోవచ్చు లేదంటే 'Video Toolbox' పై క్లిక్ చేసి Edit, Share, Embed మొదలగునవి చేసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలశ్యం మీ డిజిటల్ ఫోటోలకు మ్యూజిక్ యాడ్ చేసి ఎంజాయ్ చేస్తూ చూడండి.

ధన్యవాదాలు