అడల్ట్ కంటెంట్ వున్న సైట్స్ ని పొరపాటున పిల్లలు చూడకుండా బ్లాక్ చెయ్యటానికి OpenDNS అనే కంటెంట్ ఫిల్టరింగ్ టూల్ వుపయోగపడుతుంది. దీనికోసం ఎటువంటి సాప్ట్ వేర్ డౌన్లోడ్ లేదా ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు ... జస్ట్ DNS సెట్టింగ్స్ మార్చుకోవటమే...అదీ మూడే మూడు స్టెప్పుల్లో దీని గురించి మరిన్ని వివరాలు https://www.opendns.com/start/ లో చూడండి.
స్టెప్ ౧ లో Computer లేదా Router లేదా DNS Server లలో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకొన్న తర్వాత Internet Protocol (TCP/IP) లో DNS IP అడ్రస్ ఎలా మరియు ఏమి ఎంటర్ చెయ్యాలో స్క్రీన్ షాట్లతో చాలా చక్కగా వివరించారు.
స్టెప్ ౨ లో OpenDNS ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ - మెయిల్ కి పంపబడిన కన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.
స్టెప్ ౩ OpenDNS సిస్టం లో కాన్ఫిగర్ చేసిన తర్వాత Dashboard లో సెట్టింగ్స్ కావలసిన విధంగా మార్చుకోవాలి.
adult-related sites, illegal activity, social networking sites, video sharing sites, and general time-wasters మొదలగు సైట్ల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది.
OpenDNS సెటప్, ఎకౌంట్ క్రియేట్ చెయ్యటం, సెట్టింగ్స్ మార్చటం గురించి పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో చూడండి.
ధన్యవాదాలు