Wednesday, December 7, 2011

పిల్లల ఫేస్ బుక్ యాక్టివిటీస్ మోనిటర్ చెయ్యటం ఎలా?

మన పిల్లలు ఫేస్ బుక్ లో ఏంచేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్, ఫోటోస్, యాక్టివిటీస్  మొదలగువాటిని మోనిటర్ చెయ్యటానికి Minor Monitor అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది, అది పిల్లల ఫేస్ బుక్ యూజర్ ఐడీ, పాస్ వార్డ్ కావాలి. ఈ జెనెరేషన్ పిల్లలు పాస్ వార్డ్ చెపుతారని నేననుకోను. వాళ్ళ ఫేస్ బుక్ యూజర్ ఐడీ, పాస్ వార్డ్  తెలియకుండా మనం ఏమి చెయ్యలేం. ఒకవేళ వాళ్ళ ఫేస్ బుక్ యూజర్ ఐడీ, పాస్ వార్డ్  తెలిస్తే కనుక ఈ విధంగా చెయ్యండి. ముందుగా Minor Monitor సైట్ కి వెళ్ళి ’Get Started' పై క్లిక్ చెయ్యాలి. మన ఈ మెయిల్ ఐడీ , పాస్ వార్డ్ వివరాలు ఎంటర్ చేసి సైన్-అప్ చెయ్యాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత You must log in with your child's e-mail address and password దగ్గర ’Connect with facebook' పై క్లిక్ చేసి పిల్లల ఫేస్ బుక్ యూజర్ ఐడీ, పాస్ వార్డ్ ఎంటర్ చేసి  Minor Monitor కి పర్మిషన్ ఇవ్వటం కోసం ’Allow' పై క్లిక్ చెయ్యాలి. ఇక Minor  Monitor గత 180 రోజులలో జరిగిన యాక్టివిటీల వివరాలను తెలియచేస్తుంది. తర్వాత మరెప్పుడైనా పిల్లల యాక్టివిటీ చూడాలంటే Minor Monitor సైట్ కి వెళ్ళి 'login' పై క్లిక్ చేసి మన ఈ-మెయిల్ ఐడీ, పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. క్రింద చిత్రం లో చూపిన విధంగా పిల్లల యాక్టివిటీ లను చూడవచ్చు.


వెబ్ సైట్: Minor Monitor

ధన్యవాదాలు