Friday, December 2, 2011

CurrPorts - మనకు తెలియకుండా మన పీసీ కనెక్ట్ అయిన వెబ్ సైట్లను తెలుసుకోవటానికి!

ఒక్కొక్కసారి మన నెట్ కనెక్షన్ స్లో అవటం గమనిస్తూ ఉంటాం... మాల్వేర్లు, స్పైవేర్లు లేదా యాడ్ వేర్లు మనకు తెలియకుండా మన నెట్ కనెక్షన్ ను ఉపయోగిస్తూ ఉండటం స్లో అవటానికి ఒక కారణం కావచ్చు. అసలు మన పీసీ ఏయే వెబ్ సైట్లకు కనెక్ట్ అవుతుందో తెలుసుకోవటానికి  CurrPorts అనే ఉచిత  నెట్ వర్క్ మోనిటరింగ్ టూల్ ఉపయోగపడుతుంది. ఇది పోర్టబుల్ సాప్ట్ వేర్ దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు.  CurrPorts మన కంప్యూటర్ లో ఓపెన్ అయిన  TCP/IP and UDP ల ప్రాసెస్ వివరాలతో సహా సమగ్రంగా తెలియచేస్తుంది. అనవసరమైన ప్రాసెస్ లను కిల్ చెయ్యవచ్చు. అంతేకాకుండా అనుమానాస్పద పోర్టులను పింక్ కలర్ లో చూపుతుంది. 


డౌన్లోడ్: CurrPorts 

ధన్యవాదాలు