Wednesday, December 14, 2011

folders.io - ఫోల్డర్ మొత్తాన్ని ఒకేసారి షేర్ చెయ్యటానికి!

folders.io అనే వెబ్ సర్వీస్ ని ఉపయోగించి ఒకేసారి చాలా ఫైళ్ళను లేదా ఫోల్డర్ మొత్తాన్ని ఫ్రెండ్స్ తో లేదా కావలసిన వారితో షేర్ చేసుకోవచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా 500 MB వరకు కావలసినన్ని ఫైల్స్ లేదా ఫోల్డర్స్ పంపవచ్చు. అదే Signup చేస్తే కనుక 1GB వరకు ట్రాన్స్‍ఫర్ చెయ్యవచ్చు. 


ఫైల్స్ లేదా ఫోల్డర్లను అప్‍లోడ్ చెయ్యటం చాలా సులువు సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యవచ్చు లేదంటే కనుక add folder/ add file బటన్ల పై క్లిక్ చేసి కూడా అప్లోడ్ చెయ్యవచ్చు. ఫైల్స్ అప్ లోడ్ అయిన తర్వాత ’Start Serving'  బటన్ పై క్లిక్ చెయ్యాలి. లింక్ జెనెరేట్ అవుతుంది ఆ లింక్ ని కావలసిన వారితో షేర్ చేసుకోవచ్చు. లింక్ ని ఈ-మెయిల్ పంపటం లేదా ఫేస్ బుక్/ ట్విట్టర్ లో షేర్ చేసుకోవటం కూడా చెయ్యవచ్చు. ఫైల్స్ ని డౌన్లోడ్/ చూడటానికి లింక్ ఉపయోగపడుతుంది.  డౌన్లోడ్ కోసం కావలసిన ఫైల్ పై క్లిక్ చెయ్యాలి.

వెబ్ సైట్: folders.io

ధన్యవాదాలు