Wednesday, May 30, 2012

Bing వాల్ పేపర్ Google హోమ్ పేజ్ లో కూడా కావాలా??

Bing హోమ్ పేజీ లో రోజూ క్రొత్త క్రొత్త ఆకర్షణీయమైన ఇమేజ్ లను పెడుతూ ఉంటుంది అదే Google అయితే doodles పెడుతుంది. Bing  హోమ్ పేజ్ లోని ఇమేజ్ లు గూగుల్ లో కూడా కావాలనుకుంటే కనుక Bing Wallpaper for Google Homepage అనే Chrome ఎక్స్ టెన్షన్ ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇది ఆటోమాటిక్ గా Bing వాల్ పేపర్ ని గూగుల్ హోమ్ పేజి గా మారుస్తుంది.


1. Bing:


2.  Bing  వాల్ పెపర్ ని Google లో చూడవచ్చు


డౌన్లోడ్: Bing Wallpaper for Google Homepage

ధన్యవాదాలు

Tuesday, May 29, 2012

అన్ని బ్రౌజర్లకూ ఉపయోగపడే కీబోర్డ్ షార్ట్ కట్స్!!!

ప్రముఖ వెబ్ బ్రౌజర్లైన Mozilla Firefox, Google Chrome, Internet Explorer, Apple Safari, లేదా Opera లలో కామన్ గా ఉన్న కీబోర్డ్ షార్ట్ కట్స్ ని ఇక్కడ చూడండి.


Tabs:
Ctrl+1-8 – Switch to the specified tab, counting from the left.
Ctrl+9 – Switch to the last tab.
Ctrl+Tab – Switch to the next tab – in other words, the tab on the right. (Ctrl+Page Up also works, but not in Internet Explorer.)
Ctrl+Shift+Tab – Switch to the previous tab – in other words, the tab on the left. (Ctrl+Page Down also works, but not in Internet Explorer.)
Ctrl+W, Ctrl+F4 – Close the current tab.
Ctrl+Shift+T – Reopen the last closed tab.
Ctrl+T – Open a new tab.
Ctrl+N – Open a new browser window.
Alt+F4 – Close the current window. (Works in all applications.)

Mouse Actions for Tabs:
Middle Click a Tab – Close the tab.
Ctrl+Left Click, Middle Click – Open a link in a background tab.
Shift+Left Click – Open a link in a new browser window.
Ctrl+Shift+Left Click – Open a link in a foreground tab.

Navigation:
Alt+Left Arrow, Backspace – Back.
Alt+Right Arrow, Shift+Backspace – Forward.
F5 – Reload.
Shift+F5 – Reload and skip the cache, re-downloading the entire website.
Escape – Stop.
Alt+Home – Open homepage.

Zooming:
Ctrl and +, Ctrl+Mousewheel Up – Zoom in.
Ctrl and -, Ctrl+Mousewheel Down — Zoom out.
Ctrl+0 – Default zoom level.
F11 – Full-screen mode.

Scrolling:
Space, Page Down – Scroll down a frame.
Page Up – Scroll up a frame.
Home – Top of page.
End – Bottom of page.
Middle Click – Scroll with the mouse.

Address Bar:
Ctrl+L, Alt+D, F6 – Focus the address bar so you can begin typing.
Ctrl+Enter – Prefix www. and append .com to the text in the address bar, and then load the website. For example, type howtogeek into the address bar and press Ctrl+Enter to open www.howtogeek.com.
Alt+Enter – Open the location in the address bar in a new tab.

Search:
Ctrl+K, Ctrl+E – Focus the browser’s built-in search box or focus the address bar if the browser doesn’t have a dedicated search box. (Ctrl+K doesn’t work in IE, Ctrl+E does.)
Alt+Enter – Perform a search from the search box in a new tab.
Ctrl+F, F3 – Open the in-page search box to search on the current page.
Ctrl+G, F3 – Find the next match of the searched text on the page.
Ctrl+Shift+G, Shift+F3 – Find the previous match of the searched text on the page.

History & Bookmarks:
Ctrl+H – Open the browsing history.
Ctrl+J – Open the download history.
Ctrl+D – Bookmark the current website.
Ctrl+Shift+Del – Open the Clear Browsing History window.

Other Functions:
Ctrl+P – Print the current page.
Ctrl+S – Save the current page to your computer.
Ctrl+O – Open a file from your computer.
Ctrl+U – Open the current page’s source code. (Not in IE.)
F12 – Open Developer Tools. (Not in Firefox.)

howtogeek నుండి సేకరించబడినది.

ధన్యవాదాలు

Monday, May 28, 2012

So.cl - మైక్రోసాప్ట్ నుండి సోషల్ నెట్ వర్క్!!!



ఫేస్ బుక్, గూగుల్ + లా మరొక సొషల్ నెట్ వర్క్ అదే So.cl .... అదీ మైక్రోసాఫ్ట్ నుండి.. ఇది సోషల్ నెట్ వర్క్ మాత్రమే కాదు ఒక సెర్చ్ సైట్ కూడా. ఏదో నేర్చుకోవాలన్న తపన ఉన్న  వారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కావలసిన టాపిక్ పై సెర్చ్ చేసి కావలసిన సమాచారాన్ని సేకరించవచ్చు మరియు షేర్ చేసుకోవచ్చు. ఇది ఒకరకంగా సెర్చ్ సొషల్ నెట్ వర్క్ గా చెప్పవచ్చు.

మీకు ఆల్రెడీ ఉన్న ఫేస్ బుక్ లేదా విండోస్ లైవ్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యవచ్చు, అయితే పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది. టెర్మ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత హోమ్ పేజ్ వస్తుంది


మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి:



Website: So.cl

ధన్యవాదాలు

Eassos Recovery - డిలీట్ చెయ్యబడిన డాటా మరియు డిస్క్ పార్టీషన్లను రికవర్ చెయ్యటానికి!!!

పీసీ నుండి డిలీట్ అయిన ఫైళ్ళను మరియు పోయిన డిస్క్ పార్టీషన్లను రికవర్ చెయ్యటానికి Eassos Recovery అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది. బిల్ట్-ఇన్ విజార్డ్ (స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్) ఉపయోగించి సులభంగా ఫైళ్ళను రికవర్ చెయ్యవచ్చు. రికవర్ చేసే డాటా ని సేవ్ చేసుకోవటానికి అదే డిస్క్ కాకుండా వేరొక డిస్క్ లేదా ఎక్స్ టెర్నల్ డిస్క్ ఉపయోగించటం మంచిది. 


మరింత సమాచారం కోసం Eassos Recovery సైట్ చూడండి.

డౌన్లోడ్: Eassos Recovery 

ధన్యవాదాలు

Tuesday, May 22, 2012

PageFlip PDF to PowerPoint - పీడీఎఫ్ ఫైళ్ళను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లగా మార్చటానికి!!!

పీడీఎఫ్ ఫైళ్ళను పీడీఎఫ్ లోకి కన్వర్ట్ చెయ్యటానికి PageFlip PDF to PowerPoint అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది.  మల్టిపుల్ PDF ఫైళ్ళను ఒకేసారి PowerPoint గా మార్చవచ్చు(Batch Convert Mode) మరియు Hot Directories Mode అంటే ఒక ప్రత్యేక ఫోల్డర్ లో పీడీఎఫ్ ఫైల్ కాపీ చేస్తే అవి ఆటోమాటిక్ గా PowerPoint  ఫైల్ గా మార్చబడుతుంది. అంతేకాకుండా Command Line Mode కూడా దీనిలో ఉంది. మెయిన్ స్క్రీన్ లో మనకు కావలసిన మోడ్ ని ఎంచుకొని పీడీఎఫ్ పైళ్ళను సెలెక్ట్ చేసుకోవటానికి ’Next' పై క్లిక్ చెయ్యాలి.  తర్వాత  'Convert' పై క్లిక్ చెయ్యాలి. 

'

మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: PageFlip PDF to PowerPoint

ధన్యవాదాలు

Friday, May 18, 2012

Geek Uninstaller - అనవసరమైన ప్రోగ్రాములను పీసీ నుండి తొలగించటానికి...

సాధారణంగా మన పీసీ నుండి అనవసరమైన ప్రోగ్రాములను తొలగించటానికి కంట్రోల్ ప్యానల్ లోని 'Add Remove Programs' ని ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తొలగించిన సాప్ట్ వేర్ కి సంబంధించిన ఫైల్స్ మరియు రిజిస్ట్రీ ఎంట్రీలు అలానే ఉండిపోతాయి. అలాకాకూండా తొలగించిన సాప్ట్ వేర్ మన పీసీ నుండి శాశ్వతంగా మరియు పూర్తిగా తొలగిపోవటానికి అడ్వాన్స్ డు టూల్స్ ఉపయోగించాలి. అలాంటిదే ఈ Geek Uninstaller, ఇది ఒక ఉచిత పోర్టబుల్ టూల్...


Geek Installer ని డౌన్లోడ్ చేసుకొని రన్ చేసినప్పుడు, ఇది మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన అన్ని ప్రోగ్రాములను చూపిస్తుంది. తొలగించవలసిన ప్రోగ్రామ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Uninstall...' పై క్లిక్ చెయ్యాలి. మరింత సమాచారం కోసం Geek Uninstaller సైట్ చూడండి.

ఇటువంటిదే మరొక బెస్ట్ టూల్ Revo Uninstaller దీని గురించి ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Geek Uninstaller

ధన్యవాదాలు

Wednesday, May 16, 2012

VideoCacheView - యూట్యూబ్ స్ప్లిట్ వీడియోలను ఒకే ఫైల్ గా కాపీ చేసుకోవటానికి...

మనం ఏదైనా సైట్ కి వెళ్ళి వీడియోలను చూసినప్పుడు ఆ వీడియోలు బ్రౌజర్ Cache లో స్టోర్ చెయ్యబడతాయి. VideoCacheView అనే ఉచిత టూల్  బ్రౌజర్ Cache ని పూర్తిగా స్కాన్ చేసి దానిలోని ఆడియో/ వీడియో ఫైళ్ళను చూపిస్తుంది, కావలసిన వాటిని సులువుగా హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకొని ఆఫ్ లైన్ లో చూసుకోవచ్చు. ఈ టూల్ Internet Explorer, Firefox, Google Chrome మరియు  Opera లను సపోర్ట్ చేస్తుంది. క్రొత్త వెర్షన్ లో యూట్యూబ్ సైట్ లో చూసిన స్ప్లిట్ వీడియోలను ఈ టూల్ ఒకే ఫైల్ గా చూపిస్తుంది, దానినే కాపీ చేసుకుంటే సరిపోతుంది. 


NirLauncher, WakeMeOnLAN, NetBScanner మొదలగు ప్రముఖ అప్లికేషన్లను అందించిన NirSoft VideoCacheView ని రూపొందించింది. మరింత సమాచారం కోసం VideoCacheView సైట్ చూడండి.

డౌన్లోడ్: VideoCacheView

ధన్యవాదాలు

Flip PDF to Word - మల్టిపుల్ పీడీఎఫ్ ఫైళ్ళను ఒకేసారి వర్డ్ లోకి మార్చటానికి...

పీడీఎఫ్ పైళ్ళను మనకు కావలసిన విధంగా ఎడిట్ చెయ్యటం కోసం టెక్స్ట్ లేదా వర్డ్ పైళ్ళు గా కన్వర్ట్ చేసుకోవలసి ఉంటుంది. పీడీఎఫ్ నుండి వర్డ్ లోకి మార్చటానికి నెట్ లో అనేక అప్లికేషన్స్ దొరుకుతాయి. అలాగే Flip PDF to Word అనే ఉచిత అప్లికేషన్  కూడా పీడీఎఫ్ పైళ్ళను PDF నుండి Word లోకి మార్చటానికి ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే అనేక PDF ఫైళ్ళను ఒకేసారి Word లోకి మార్చవచ్చు(Batch Convert Mode) . మరొక ప్రత్యేకత Hot Directories Mode అంటే ఒక ప్రత్యేక ఫోల్డర్ లో పీడీఎఫ్ ఫైల్ కాపీ చేస్తే అవి ఆటోమాటిక్ గా వర్డ్ ఫైల్ గా మార్చబడుతుంది. అంతేకాకుండా Command Line Mode కూడా దీనిలో ఉంది. 


Feature:
1. Free of charge to convert PDF file to editable Word document, with all the original text, images, graphics, hyperlinks, layout and formatting exactly preserved.
 
2. The output Word document has no text boxes which makes PDF editing easier.
3. Support exporting Microsoft Office Word 2003/2007/2010.
4. Support Command line mode and watched folder (Hot Dir) mode to convert pdf to word.
డౌన్లోడ్: Flip PDF to Word
ధన్యవాదాలు

Friday, May 11, 2012

DesktopNow Remote Computer Access : మీ పీసీ LAN లేదా ఇంటర్నెట్ లో వెబ్ యాక్సెస్ చెయ్యటానికి!!!

DesktopNow అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి మన పీసీ లో కావలసిన ఫైల్స్ మరియు ఫోల్డర్లను లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) లేదా ఇంటర్నెట్ లో వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అన్ని బ్రౌజర్లలో పనిచేస్తుంది.  DesktopNow డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ సమయం లో కొన్ని అనవసర అప్లికేషన్లు కూడా ఇనస్టలేషన్ చెయ్యబడతాయి కాబట్టి వాటిని అన్-చెక్ చేసి 'Finish' పై క్లిక్ చెయ్యాలి. 

ముందుగా అకౌంట్ సెటప్ దగ్గర మన ఈ-మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. LAN/WAN లో మన పీసీ ని యాక్సెస్ చేసేటప్పుడు  ఈ-మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఇవ్వవలసి ఉంటుంది. 

DesktopNow Setup
నెక్స్ట్ లో మనం షేర్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

Choose Folder
నెక్స్ట్ స్టెప్ లో క్లౌడ్ యాక్సెస్ అవసరమైతే అక్కడ చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ’Finish' పై క్లిక్ చెయ్యాలి.
Cloud Access


సెటప్ పూర్తి అయ్యి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ’Tools' ---> 'Options' లో ’Web Acces' టాబ్ లో Local Network, Public Network ల దగ్గర లింక్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి వేరొక పీసీ లో వెబ్ బ్రౌజర్ ద్వారా మన పీసీ లో షేర్ చెయ్యబడిన ఫైల్స్ లేదా ఫోల్డర్లను యాక్సెస్ చెయ్యవచ్చు. 


Desktop Now
Options
Web Access
Web Interface
డౌన్లోడ్: DesktopNow

ధన్యవాదాలు

Wednesday, May 9, 2012

IVRS ద్బారా ఇక APSRTC టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు....

రోజుకు 22265 బస్ లతో 79 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తూ 127.09 లక్షల ప్రయాణీకులను తమ గమ్యాలను చేరుస్తూ అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నీస్ బుక్ ఎక్కిన Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) సంస్ధ Interactive Voice Response System-based (IVRS) ఆధారిత సిస్టం ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని నిన్న ప్రారంభించింది. దీంతో ఈ పద్ధతిలో టికెట్ బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించే మొదటి రాష్ట్రం గా అవతరించింది. దీనికోసం APSRTC  Abhibus తో ఒక ఒప్పందం కురుర్చుకుంది. 


ప్రయాణీకులు 1800-200-4599 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కాల్ సెంటర్ ఆపరేటర్ కి మన ప్రయాణం సంబందించిన ఎక్కవలసిన/ దిగవలసిన ప్రదేశాలు,  తేదీ, సమయం తదితర వివరాలు తెలియచెయ్యాలి.  సీట్ల లభ్యత ను అనుసరించి కావల్సిన బస్ ని ఎంచుకొని మన మొబైల్ నంబరు మరియు మెయిల్ ఐడీ తెలియచెయ్యాలి. టికెట్ బుక్ అయిన తర్వాత టికెట్ సంబంధించిన వివరాలు/ఈ-టికెట్ వాటికి పంపబడతాయి. పైన తెలిపిన వివరాలు చెప్పిన తర్వాత IVRS కు అనుసంధానం చెయ్యబడుతుంది, అక్కడ తెలియ చేసే సూచనలకనుగుణంగా మన క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చెయ్యాలి. 


ధన్యవాదాలు 

Tuesday, May 8, 2012

IRCTC సైట్ లో తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసే వారికి ఉపయోగపడే Magic Autofill టూల్!!

IRCTC సైట్ లో కన్ఫార్మ్ డు తత్కాల్ టిక్కెట్స్  బుక్ చేసుకోవటం చాలా కష్టం... మనం సైట్ లో టికెట్ బుక్ చేసుకునే లోపే కౌంటర్ లో తత్కాల్ కోటా అయిపోతుంది.  అందుకే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవటం కోసం తెల్లవారుజాముకే కౌంటర్ల్ల దగ్గర పడిగాపులు కాయాల్సివస్తుంది లేదంటే ఏజెంట్ పై ఆధారపడవలసి వస్తుంది. ఇక్కడ చెప్పబోయే చిన్న ఆటోఫిల్ టూల్ ఉపయోగించి ప్రయాణీకుల పేర్లు తదితర వివరాలను ముందుగా సిద్ధం చేసుకొని తర్వాత IRCTC సైట్ లో ఆటో ఫిల్ చేసుకోవచ్చు దీంతో ఆ సైట్ లో ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చెయ్యటానికి పట్టే సమయాన్ని ఆదాచెయ్యవచ్చు.

అదెలాగో ఈ క్రింది డిజిటల్ ఇన్స్ఫిరేషన్ వీడియో చూడండి:


పై వీడియోలో తెలిపిన Magic Autofill ఫార్మ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి, అక్కడ ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేసి ’I'm feeling lucky' పై క్లిక్ చెయ్యాలి, తర్వాత అక్కడ వచ్చే ’Magic Autofill' ని బుక్ మార్క్ టూల్ బార్ లోకి డ్రాగ్ చెయ్యాలి. ఇప్పుడు IRCTC సైట్ కి వెళ్ళినప్పుడు ’Passeger Details' దగ్గర ప్రయాణీకుల విరాలు ఆటోమాటిక్ గా ఫిల్ చెయ్యటం కోసం బుక్ మార్క్ చేసుకున్న ’Magic Autofill' పై క్లిక్ చెయ్యాలి అంతే.


సేకరణ: Digital Inspiration నుండి.

ధన్యవాదాలు

Monday, May 7, 2012

స్టూడెంట్స్ కోసం సెర్చ్ ఎడ్యుకేషన్[Search Education] ని ప్రారంభించిన గూగుల్...

గూగుల్ సెర్చ్ ని ఎలా ఉపయోగించాలనే దానిపై విద్యార్ధులను ఎడ్యుకేట్/ ట్రైనింగ్ ఇవ్వటం కోసం గూగుల్ సెర్చ్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ని ప్రారంభించింది. ఈ సైట్ విద్యార్ధులకే కాక ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ  Lesson Plans తో పాటు Live Training ని కూడా అందిస్తున్నారు. ఈ సైట్ లోని ట్యుటోరియల్స్ విద్యార్ధులు తమ కావలసిన సబ్జెట్ కి సంబంధించిన సరైన సమాచారాన్ని సెర్చ్ చెయ్యటం లో ఎంతగానో ఉపకరిస్తాయి.





వెబ్ సైట్: Google Search Education

ధన్యవాదాలు

Saturday, May 5, 2012

Orion File Recovery - డిలీట్ అయిన ఫైళ్ళను రికవర్ చెయ్యటానికి!!!

డాటా రికవరీ సాప్ట్ వేర్ల గురించి ఇంతకు ముందు చాలా పోస్టుల్లో చూశాం... వాటిలో Recuva ఒక బెస్ట్ డాటా రికవరీ టూల్ అని చెప్పవచ్చు.  Orion File Recovery Software ఇది మరొక ఫైల్ రికవరీ టూల్ ... దీనిని ఉపయోగించి లోకల్ హార్డ్ డిస్క్, ఎక్స్ టెర్నల్ హార్డ్ డిస్క్, మెమొరీకార్డ్ ల నుండి తొలగించిడ్ియో,ఆడియో, ఇమేజ్, డాక్యుమెంట్ మొ.   ఫైల్స్ ని రికవర్ చెయ్యవచ్చు.  Orion FAT మరియు NTFS ఫైల్ సిస్తమ్స్ ని సపోర్ట్ చేస్తుంది. రికవర్ చెయ్యబోయే డాటా సైజ్ ముందుగా తెలియచెయ్యటం వలన రికవర్ చేసుకోవటానికి సరిపోయే డ్రైవ్ ని ముందుగానే ఎంచుకోవచ్చు.

Orion ని ఇనస్టలేషన్ చేసేటప్పుడు FileFort Backup Software మరియు NCH Software Internet Browser Toolbar మొదలగు వాటిని కూడా ఇనస్టలేషన్ చేస్తుంది కాబట్టి వాటిని అన్-చెక్ చెయ్యండి. అప్లికేషన్ ని రన్ చేసిన తర్వాత డ్రైవ్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రికవర్ చెయ్యవలసిన ఫైల్ టైప్ ని ఎంచుకోవాలి. రికవర్ చెయ్యబడే ఫైళ్ళను సేవ్ చేసుకోవటానికి సోర్స్ డిస్క్ కాకుండా వెరొక లొకేషన్ ఎంచుకోవటం ఉత్తమం.

Recover File Wizard

Recover File Wizard_step2
Orion File Recovery Software
Orion File Recovery works on Windows XP, Windows Vista, Windows 7 and Windows 8.
ధన్యవాదాలు

Thursday, May 3, 2012

అవయవదానాన్ని ప్రోత్సహించటానికి ఫేస్ బుక్ క్రొత్త ఫీచర్...

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ అవయవదానాన్ని ప్రోత్సహించటానికి క్రొత్త ఫీచర్ 'Organ Donor' ని ’Time Line ' లోని ’Life Event' లో తెచ్చింది. మెడికల్ ఫీల్డ్ లో పని చేస్తున్న తన గర్ల్ ప్రెండ్ తో డిన్నర్ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో వచ్చిన ఐడియాతో అవయవ దానం యొక్క ఆవశ్యకతను తెలియచెయ్యాలని  క్రొత్త ఫీచర్ యాడ్ చెయ్యనున్నట్లు ఫేస్ బుక్ CEO Mark Zuckerberg US television లో గుడ్ మార్నింగ్ అమెరికా షో లో తెలియచేశారు.   అంతేకాకుండా యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుండి కూడా స్పూర్తి పొందినట్లు చెప్పారు.  స్టీవ్ జాబ్స్ కి ఆయన చనిపోవటానికి సంవత్సరం ముందు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు.


ప్రస్తుతానికి ఈ ఫీచర్ US మరియు బ్రిటన్ దేశాలలో పరిచయం చేశారు. ఇక్కడ విజయవంతమైతే ఈ పీచర్ ని మిగతా దేశాల్లో విస్తరించనున్నారు.

ధన్యవాదాలు

Wednesday, May 2, 2012

రైళ్ళలో ఇంటర్నెట్ సదుపాయం...

వై-ఫై టెక్నాలజీ ద్వారా రైలు లో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సదుపాయాన్ని త్వరలో పొందవచ్చు. శాటిలైట్ ఆధారిత వై-ఫై ని ఉపయోగించి భోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు.  పైలట్ ప్ర్రాజెక్ట్ క్రింద ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ నుండి కలకత్తా వెళ్ళే హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఈ సర్వీస్ ని ప్రారంభించనున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి నెట్ వినియోగించటానికి ప్రయాణికులనుండి ఎటువంటి రుసుము వసూలు చెయ్యరు.  దీనికోసం  రూ.6.30 కోట్లు ఖర్చు చెయ్యనున్నారు.  ఇది విజయవంతమైతే మిగతా రైళ్ళలో కూడా అమలుచేస్తారు.



రైలు ఇంజిన్ కి అమర్చిన యాంటీనా శాటిలైట్ తో అనుసంధానం చెయ్యబడి ఉంటుంది, వై-ఫై ద్వారా భోగీల్లో ప్రయాణిస్తున్న వారు నెట్ పొందవచ్చు. నెట్ కి కనెక్ట్ అవ్వటం కోసం TTE  ఇచ్చిన నంబర్ కి మన మొబైల్ నుండి డయల్ చేసి పాస్ వార్డ్  పొందవచ్చు. 

KU band నుండి బ్యాండ్ విడ్త్ పొందటానికి అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనుమతి ఇచ్చింది.

ధన్యవాదాలు

Tuesday, May 1, 2012

మీ క్లౌడ్ అప్లికేషన్లన్నిటినీ ఒకే చోట నుండి మేనేజ్ చెయ్యటానికి...

కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు....




క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లు  DropboxGoogle CalendarGoogle DocsPivotal TrackerGoogle TasksGitHub మొదలగు వాటిని ఆయా  సైట్లకు వెళ్ళకుండా ఒకే చోట నుండి మేనేజ్ చెయ్యవచ్చు దీంతో చాలా సమయాన్ని ఆదాచెయ్యవచ్చుఅంతేకాకుండా  ఆయా క్లౌడ్ అప్లికేషన్లను మీ టీమ్ మెంబర్స్ తో కలసి (యాక్సెస్, సింక్ మరియు డిస్కస్) పనిచెయ్యటానికి  Busyflow  అనే వెబ్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.   అదెలాగో ఈ క్రింది వీడియో లో చూడండి: 





Busyflow ఉపయోగించటానికి ముందుగా సైన్-అప్ చెయ్యాలి. లేదంటే గూగుల్ లేదా ట్విట్టర్ అకౌంట్ లతో లాగిన్ చెయ్యవచ్చు. లాగిన్ అయిన తర్వాత Hive పేరు ఇచ్చి వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వర్క్ స్పేస్ లో వివిధ టూల్స్ ఉంటాయి. వాటిలో కావలసిన  దానిని Hive కి యాడ్ చెయ్యాలి.  కావలసిన అప్లికేషన్ ఎంచుకున్న తర్వాత యూజర్ నేమ్ , పాస్ వర్డ్ తో లాగిన్ చేసి పర్మిషన్ [Allow] ఇవ్వవలసి వస్తుంది. కావలసిన ఫైల్ పై డిస్కస్ చెయవచ్చు, వేరొక ఫైల్ అటాచ్ చెయ్యవచ్చు... Hive దగ్గర ఉన్న Settings పై క్లిక్ చేసి మెంబర్స్ యొక్క ఈ-మెయిల్ ఐడీ తో వారిని ఆహ్వానించవచ్చు.





మరింత సమాచారం కోసం Busyflow సైట్ చూడండి.


ధన్యవాదాలు