Thursday, May 3, 2012

అవయవదానాన్ని ప్రోత్సహించటానికి ఫేస్ బుక్ క్రొత్త ఫీచర్...

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ అవయవదానాన్ని ప్రోత్సహించటానికి క్రొత్త ఫీచర్ 'Organ Donor' ని ’Time Line ' లోని ’Life Event' లో తెచ్చింది. మెడికల్ ఫీల్డ్ లో పని చేస్తున్న తన గర్ల్ ప్రెండ్ తో డిన్నర్ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో వచ్చిన ఐడియాతో అవయవ దానం యొక్క ఆవశ్యకతను తెలియచెయ్యాలని  క్రొత్త ఫీచర్ యాడ్ చెయ్యనున్నట్లు ఫేస్ బుక్ CEO Mark Zuckerberg US television లో గుడ్ మార్నింగ్ అమెరికా షో లో తెలియచేశారు.   అంతేకాకుండా యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుండి కూడా స్పూర్తి పొందినట్లు చెప్పారు.  స్టీవ్ జాబ్స్ కి ఆయన చనిపోవటానికి సంవత్సరం ముందు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు.


ప్రస్తుతానికి ఈ ఫీచర్ US మరియు బ్రిటన్ దేశాలలో పరిచయం చేశారు. ఇక్కడ విజయవంతమైతే ఈ పీచర్ ని మిగతా దేశాల్లో విస్తరించనున్నారు.

ధన్యవాదాలు