Wednesday, May 16, 2012

VideoCacheView - యూట్యూబ్ స్ప్లిట్ వీడియోలను ఒకే ఫైల్ గా కాపీ చేసుకోవటానికి...

మనం ఏదైనా సైట్ కి వెళ్ళి వీడియోలను చూసినప్పుడు ఆ వీడియోలు బ్రౌజర్ Cache లో స్టోర్ చెయ్యబడతాయి. VideoCacheView అనే ఉచిత టూల్  బ్రౌజర్ Cache ని పూర్తిగా స్కాన్ చేసి దానిలోని ఆడియో/ వీడియో ఫైళ్ళను చూపిస్తుంది, కావలసిన వాటిని సులువుగా హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకొని ఆఫ్ లైన్ లో చూసుకోవచ్చు. ఈ టూల్ Internet Explorer, Firefox, Google Chrome మరియు  Opera లను సపోర్ట్ చేస్తుంది. క్రొత్త వెర్షన్ లో యూట్యూబ్ సైట్ లో చూసిన స్ప్లిట్ వీడియోలను ఈ టూల్ ఒకే ఫైల్ గా చూపిస్తుంది, దానినే కాపీ చేసుకుంటే సరిపోతుంది. 


NirLauncher, WakeMeOnLAN, NetBScanner మొదలగు ప్రముఖ అప్లికేషన్లను అందించిన NirSoft VideoCacheView ని రూపొందించింది. మరింత సమాచారం కోసం VideoCacheView సైట్ చూడండి.

డౌన్లోడ్: VideoCacheView

ధన్యవాదాలు