Tuesday, May 1, 2012

మీ క్లౌడ్ అప్లికేషన్లన్నిటినీ ఒకే చోట నుండి మేనేజ్ చెయ్యటానికి...

కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు....




క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లు  DropboxGoogle CalendarGoogle DocsPivotal TrackerGoogle TasksGitHub మొదలగు వాటిని ఆయా  సైట్లకు వెళ్ళకుండా ఒకే చోట నుండి మేనేజ్ చెయ్యవచ్చు దీంతో చాలా సమయాన్ని ఆదాచెయ్యవచ్చుఅంతేకాకుండా  ఆయా క్లౌడ్ అప్లికేషన్లను మీ టీమ్ మెంబర్స్ తో కలసి (యాక్సెస్, సింక్ మరియు డిస్కస్) పనిచెయ్యటానికి  Busyflow  అనే వెబ్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.   అదెలాగో ఈ క్రింది వీడియో లో చూడండి: 





Busyflow ఉపయోగించటానికి ముందుగా సైన్-అప్ చెయ్యాలి. లేదంటే గూగుల్ లేదా ట్విట్టర్ అకౌంట్ లతో లాగిన్ చెయ్యవచ్చు. లాగిన్ అయిన తర్వాత Hive పేరు ఇచ్చి వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వర్క్ స్పేస్ లో వివిధ టూల్స్ ఉంటాయి. వాటిలో కావలసిన  దానిని Hive కి యాడ్ చెయ్యాలి.  కావలసిన అప్లికేషన్ ఎంచుకున్న తర్వాత యూజర్ నేమ్ , పాస్ వర్డ్ తో లాగిన్ చేసి పర్మిషన్ [Allow] ఇవ్వవలసి వస్తుంది. కావలసిన ఫైల్ పై డిస్కస్ చెయవచ్చు, వేరొక ఫైల్ అటాచ్ చెయ్యవచ్చు... Hive దగ్గర ఉన్న Settings పై క్లిక్ చేసి మెంబర్స్ యొక్క ఈ-మెయిల్ ఐడీ తో వారిని ఆహ్వానించవచ్చు.





మరింత సమాచారం కోసం Busyflow సైట్ చూడండి.


ధన్యవాదాలు