Wednesday, May 2, 2012

రైళ్ళలో ఇంటర్నెట్ సదుపాయం...

వై-ఫై టెక్నాలజీ ద్వారా రైలు లో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సదుపాయాన్ని త్వరలో పొందవచ్చు. శాటిలైట్ ఆధారిత వై-ఫై ని ఉపయోగించి భోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు.  పైలట్ ప్ర్రాజెక్ట్ క్రింద ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ నుండి కలకత్తా వెళ్ళే హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఈ సర్వీస్ ని ప్రారంభించనున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి నెట్ వినియోగించటానికి ప్రయాణికులనుండి ఎటువంటి రుసుము వసూలు చెయ్యరు.  దీనికోసం  రూ.6.30 కోట్లు ఖర్చు చెయ్యనున్నారు.  ఇది విజయవంతమైతే మిగతా రైళ్ళలో కూడా అమలుచేస్తారు.



రైలు ఇంజిన్ కి అమర్చిన యాంటీనా శాటిలైట్ తో అనుసంధానం చెయ్యబడి ఉంటుంది, వై-ఫై ద్వారా భోగీల్లో ప్రయాణిస్తున్న వారు నెట్ పొందవచ్చు. నెట్ కి కనెక్ట్ అవ్వటం కోసం TTE  ఇచ్చిన నంబర్ కి మన మొబైల్ నుండి డయల్ చేసి పాస్ వార్డ్  పొందవచ్చు. 

KU band నుండి బ్యాండ్ విడ్త్ పొందటానికి అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనుమతి ఇచ్చింది.

ధన్యవాదాలు