Tuesday, May 8, 2012

IRCTC సైట్ లో తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసే వారికి ఉపయోగపడే Magic Autofill టూల్!!

IRCTC సైట్ లో కన్ఫార్మ్ డు తత్కాల్ టిక్కెట్స్  బుక్ చేసుకోవటం చాలా కష్టం... మనం సైట్ లో టికెట్ బుక్ చేసుకునే లోపే కౌంటర్ లో తత్కాల్ కోటా అయిపోతుంది.  అందుకే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవటం కోసం తెల్లవారుజాముకే కౌంటర్ల్ల దగ్గర పడిగాపులు కాయాల్సివస్తుంది లేదంటే ఏజెంట్ పై ఆధారపడవలసి వస్తుంది. ఇక్కడ చెప్పబోయే చిన్న ఆటోఫిల్ టూల్ ఉపయోగించి ప్రయాణీకుల పేర్లు తదితర వివరాలను ముందుగా సిద్ధం చేసుకొని తర్వాత IRCTC సైట్ లో ఆటో ఫిల్ చేసుకోవచ్చు దీంతో ఆ సైట్ లో ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చెయ్యటానికి పట్టే సమయాన్ని ఆదాచెయ్యవచ్చు.

అదెలాగో ఈ క్రింది డిజిటల్ ఇన్స్ఫిరేషన్ వీడియో చూడండి:


పై వీడియోలో తెలిపిన Magic Autofill ఫార్మ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి, అక్కడ ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేసి ’I'm feeling lucky' పై క్లిక్ చెయ్యాలి, తర్వాత అక్కడ వచ్చే ’Magic Autofill' ని బుక్ మార్క్ టూల్ బార్ లోకి డ్రాగ్ చెయ్యాలి. ఇప్పుడు IRCTC సైట్ కి వెళ్ళినప్పుడు ’Passeger Details' దగ్గర ప్రయాణీకుల విరాలు ఆటోమాటిక్ గా ఫిల్ చెయ్యటం కోసం బుక్ మార్క్ చేసుకున్న ’Magic Autofill' పై క్లిక్ చెయ్యాలి అంతే.


సేకరణ: Digital Inspiration నుండి.

ధన్యవాదాలు