సాధారణంగా మన పీసీ నుండి అనవసరమైన ప్రోగ్రాములను తొలగించటానికి కంట్రోల్ ప్యానల్ లోని 'Add Remove Programs' ని ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తొలగించిన సాప్ట్ వేర్ కి సంబంధించిన ఫైల్స్ మరియు రిజిస్ట్రీ ఎంట్రీలు అలానే ఉండిపోతాయి. అలాకాకూండా తొలగించిన సాప్ట్ వేర్ మన పీసీ నుండి శాశ్వతంగా మరియు పూర్తిగా తొలగిపోవటానికి అడ్వాన్స్ డు టూల్స్ ఉపయోగించాలి. అలాంటిదే ఈ Geek Uninstaller, ఇది ఒక ఉచిత పోర్టబుల్ టూల్...
Geek Installer ని డౌన్లోడ్ చేసుకొని రన్ చేసినప్పుడు, ఇది మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన అన్ని ప్రోగ్రాములను చూపిస్తుంది. తొలగించవలసిన ప్రోగ్రామ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Uninstall...' పై క్లిక్ చెయ్యాలి. మరింత సమాచారం కోసం Geek Uninstaller సైట్ చూడండి.
ఇటువంటిదే మరొక బెస్ట్ టూల్ Revo Uninstaller దీని గురించి ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: Geek Uninstaller
ధన్యవాదాలు