DesktopNow అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి మన పీసీ లో కావలసిన ఫైల్స్ మరియు ఫోల్డర్లను లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) లేదా ఇంటర్నెట్ లో వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అన్ని బ్రౌజర్లలో పనిచేస్తుంది. DesktopNow డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ సమయం లో కొన్ని అనవసర అప్లికేషన్లు కూడా ఇనస్టలేషన్ చెయ్యబడతాయి కాబట్టి వాటిని అన్-చెక్ చేసి 'Finish' పై క్లిక్ చెయ్యాలి.
ముందుగా అకౌంట్ సెటప్ దగ్గర మన ఈ-మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. LAN/WAN లో మన పీసీ ని యాక్సెస్ చేసేటప్పుడు ఈ-మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఇవ్వవలసి ఉంటుంది.


నెక్స్ట్ స్టెప్ లో క్లౌడ్ యాక్సెస్ అవసరమైతే అక్కడ చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ’Finish' పై క్లిక్ చెయ్యాలి.

సెటప్ పూర్తి అయ్యి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ’Tools' ---> 'Options' లో ’Web Acces' టాబ్ లో Local Network, Public Network ల దగ్గర లింక్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి వేరొక పీసీ లో వెబ్ బ్రౌజర్ ద్వారా మన పీసీ లో షేర్ చెయ్యబడిన ఫైల్స్ లేదా ఫోల్డర్లను యాక్సెస్ చెయ్యవచ్చు.




డౌన్లోడ్: DesktopNow
ధన్యవాదాలు