డాటా రికవరీ సాప్ట్ వేర్ల గురించి ఇంతకు ముందు చాలా పోస్టుల్లో చూశాం... వాటిలో Recuva ఒక బెస్ట్ డాటా రికవరీ టూల్ అని చెప్పవచ్చు. Orion File Recovery Software ఇది మరొక ఫైల్ రికవరీ టూల్ ... దీనిని ఉపయోగించి లోకల్ హార్డ్ డిస్క్, ఎక్స్ టెర్నల్ హార్డ్ డిస్క్, మెమొరీకార్డ్ ల నుండి తొలగించిడ్ియో,ఆడియో, ఇమేజ్, డాక్యుమెంట్ మొ. ఫైల్స్ ని రికవర్ చెయ్యవచ్చు. Orion FAT మరియు NTFS ఫైల్ సిస్తమ్స్ ని సపోర్ట్ చేస్తుంది. రికవర్ చెయ్యబోయే డాటా సైజ్ ముందుగా తెలియచెయ్యటం వలన రికవర్ చేసుకోవటానికి సరిపోయే డ్రైవ్ ని ముందుగానే ఎంచుకోవచ్చు.
Orion ని ఇనస్టలేషన్ చేసేటప్పుడు FileFort Backup Software మరియు NCH Software Internet Browser Toolbar మొదలగు వాటిని కూడా ఇనస్టలేషన్ చేస్తుంది కాబట్టి వాటిని అన్-చెక్ చెయ్యండి. అప్లికేషన్ ని రన్ చేసిన తర్వాత డ్రైవ్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రికవర్ చెయ్యవలసిన ఫైల్ టైప్ ని ఎంచుకోవాలి. రికవర్ చెయ్యబడే ఫైళ్ళను సేవ్ చేసుకోవటానికి సోర్స్ డిస్క్ కాకుండా వెరొక లొకేషన్ ఎంచుకోవటం ఉత్తమం.