రోజుకు 22265 బస్ లతో 79 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తూ 127.09 లక్షల ప్రయాణీకులను తమ గమ్యాలను చేరుస్తూ అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నీస్ బుక్ ఎక్కిన Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) సంస్ధ Interactive Voice Response System-based (IVRS) ఆధారిత సిస్టం ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని నిన్న ప్రారంభించింది. దీంతో ఈ పద్ధతిలో టికెట్ బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించే మొదటి రాష్ట్రం గా అవతరించింది. దీనికోసం APSRTC Abhibus తో ఒక ఒప్పందం కురుర్చుకుంది.
ప్రయాణీకులు 1800-200-4599 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కాల్ సెంటర్ ఆపరేటర్ కి మన ప్రయాణం సంబందించిన ఎక్కవలసిన/ దిగవలసిన ప్రదేశాలు, తేదీ, సమయం తదితర వివరాలు తెలియచెయ్యాలి. సీట్ల లభ్యత ను అనుసరించి కావల్సిన బస్ ని ఎంచుకొని మన మొబైల్ నంబరు మరియు మెయిల్ ఐడీ తెలియచెయ్యాలి. టికెట్ బుక్ అయిన తర్వాత టికెట్ సంబంధించిన వివరాలు/ఈ-టికెట్ వాటికి పంపబడతాయి. పైన తెలిపిన వివరాలు చెప్పిన తర్వాత IVRS కు అనుసంధానం చెయ్యబడుతుంది, అక్కడ తెలియ చేసే సూచనలకనుగుణంగా మన క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చెయ్యాలి.
సేకరణ: హిందూ దిన పత్రిక నుండి
ధన్యవాదాలు