మన జీవితం లో ఎదురయ్యే అనుభవాలను, ఎవరితోను పంచుకోని వ్యక్తిగత విషయాలను వ్రాసుకోవటానికి డైరీ వుపయోగిస్తాం. ఎలక్ట్రానిక్ యుగం లో జీవితమంతా కంప్యూటర్ పై గడిచిపోతూ సాధారణ డైరీలలో చేతితో వ్రాసే తీరిక లేనివారికి Efficient Diary చక్కగా వుపయోగపడుతుంది. ఈ వుచిత వ్యక్తిగత డైరీ సాప్ట్ వేర్ లో మీ అనుభవాలు,ఐడియాలు మరియు కావల్సిన సంగతులను పొందుపర్చుకోవచ్చు. మైక్రోసాప్ట్ వర్డ్ వలె రిచ్ టెక్స్ట్ ఎడిటర్ కలిగియున్న ఈ సాప్ట్ వేర్ లో మీ ఎంట్రీలకు టేబుల్, ఎమోషన్స్, పిక్చర్,బ్యాక్ గ్రౌండ్ కలర్, ఎటాచ్మెంట్స్ జతచేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం Efficient Diary సైట్ సందర్శించండి. ఇది Windows 98/ME/NT4/2000/XP/2003/Vista లలో పనిచేస్తుంది.
ధన్యవాదాలు