Wednesday, February 25, 2009

f.lux - సమయానుకూలంగా మోనిటర్ బ్రైట్ నెస్ లో మార్పు కోసం...

రోజంతా విశ్రాంతి లేకుండా కంప్యూటర్ పై వర్క్ చేస్తుంటే సాయంత్రం అయ్యేసరికి కళ్ళు మండుతూ వుంటాయి. f.lux అనే ఉచిత యుటిలిటీ మీ సమస్యకు కొంతవరకు పరిష్కారాన్ని చూపవచ్చు. f.lux ని డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ’Change Settings' పై క్లిక్ చేసి మీరు వుంటున్న ప్రదేశం (దగ్గర లోని పెద్ద నగరాలు) యొక్క అక్షాంశరేఖ (Latitude and Longitude) వివరాలు ఎంటర్ చెయ్యాలి. మీరు వుంటున్న ప్రదేశం యొక్క అక్షాంశరేఖ వివరాలు వికీపీడియా లో తెలుసుకోవచ్చు. ఈ యుటిలిటీ సమయానుకూలంగా మోనిటర్ బ్రైట్ నెస్ ని ఎడ్జస్ట్ చేస్తుంది.



మరింత సమాచారం కోసం f.lux సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు