Monday, February 16, 2009

GSplit 3 - పెద్ద ఫైళ్ళను చిన్నవి గా విడగొట్టటానికి (split) ఉచిత సాప్ట్ వేర్


ఇంటర్నెట్ లో కొన్ని సైట్లలో లేదా ఈ-మెయిళ్ళ లో పెద్ద పెద్ద ఫైళ్ళను పంపలేము వాటిని చిన్నవిగా స్ప్లిట్ చేసి పంపటం సులువు. పెద్ద పెద్ద మీడియా, సౌండ్, జిప్ మొదలగు ఫైళ్ళను చిన్నవిగా విడగొట్టటానికి వుపయోగపడే వుచిత మరియు శక్తివంతమైన ఫైల్ స్ప్లిట్టర్ - GSplit. ఫైల్ ని స్ప్లిట్ చెయ్యటం చాలా సులువు ముందుగా స్ప్లిట్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసిన తర్వాత ఫైళ్ళను కాపీ చెయ్యటానికి డెస్టినేషన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. Split File పై క్లిక్ చేస్తే ఫైల్ స్ప్లిట్ చెయ్యబడుతుంది, తర్వాత ఒక Executable ఫైల్ క్రియేట్ చెయ్యబడుతుంది. ఈ Executable ఫైల్ ని వుపయోగించే స్ప్లిట్ అయిన ఫైళ్ళను ఒక్కటిగా చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం GSplit సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు