
సాధారణంగా హార్డ్ డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి విండోస్ తో పాటు వచ్చే డీఫ్రాగ్మెంటేషన్ టూల్ ని వుపయోగిస్తాం, కాని ఇది చాలా స్లోగా మరియు ఎక్కువ సమయం పడుతుంది. ఇంటర్నెట్ లో లభించే వుచిత డీఫ్రాగ్మెంటేషన్ టూల్స్ ని వుపయోగించి హార్డ్ డ్రైవ్ లేదా సెలెక్టెడ్ పార్టీషన్ ని మాత్రమే డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా Defraggler కావలసిన ఫైల్, ఫోల్డర్ లేదా డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. కావలసిన ఫైల్, ఫోల్డర్ డీఫ్రాగ్మెంట్ చెయ్యటంవలన డీఫ్రాగ్మెంటేషన్ కి తక్కువ సమయం పడుతుంది. ఇది Windows 2000, 2003, XP and Vista లలో పని చేస్తుంది. USB డ్రైవ్ ల నుండి కూడా ఈ అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు.
Defraggler ప్రముఖ సాప్ట్ వేర్లు CCleaner మరియు Recuva రూపొందించిన కంపెనీ వారు అందిస్తున్న ఉచిత సాప్ట్ వేర్.
ధన్యవాదాలు