Wednesday, February 18, 2009
ఆఫ్ లైన్ లో జీ-మెయిల్ యాక్సెస్ చెయ్యటం ఎలా?
గూగుల్ తన జీ-మెయిల్ కి క్రొత్త ఫీచర్లను అందిస్తూ వస్తుంది. వాటిలో ఒకటే Gmail Offline. ఇది మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వకున్ననూ మీ మెయిల్ ఎకౌంట్ ని చూసుకోవటం లో సహాయపడుతుంది. దీని ద్వారా రీసెంట్ ఈ-మెయిళ్ళు గూగుల్ సర్వర్ నుండి మీ సిస్టం లోకి డౌన్ లోడ్ అవుతాయి. డౌన్ లోడ్ అయిన మెయిళ్ళను ఇతరులు చూడకుండా వుండాలంటే సెక్యూరిటీ పరంగా Gmail Offline పీచర్ ని మీ వ్యక్తిగత సిస్టం లో మాత్రమే ఎనేబుల్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో జీ-మెయిల్ ఎలా యాక్సెస్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం.
౧. ముందుగా మీ జీమెయిల్ కి లాగిన్ అయ్యి, కుడి చేతి ప్రక్క పైన వున్న 'Settings' పై క్లిక్ చేసి తర్వాత ’Labs'పై క్లిక్ చెయ్యాలి. GMail Lab ఫీచర్ల లో ’Offline' దగ్గర వున్న ’Enable’ ని సెలెక్ట్ చేసుకొని ’Save changes’ బటన్ పై క్లిక్ చెయ్యాలి.
౨. ఇప్పుడు మీ మెయిల్ ఎకౌంట్ లో పైన గ్రీన్ కలర్ లో జీమెయిల్ లాబ్ ఐకాన్ వస్తుంది. దాని ప్రక్కన ’Offline 0.1' అని వుంటుంది. ఇప్పుడు దానిపై క్లిక్ చెయ్యాలి.
౩. ’Install offline access for Gmail' వస్తుంది. ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
౪. ’Google Gears' ఇనస్టలేషన్ చెయ్యబడతాయి. ఇక్కడ ’I trust this site' దగ్గర టిక్ చేసి ’Allow' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
౫.ఇప్పుడు 'Gmail' షార్ట్ కట్ ఎక్కడ క్రియేట్ చెయ్యాలని అడుగుతుంది. కావలసిన చోట టిక్ పెట్టుకొని ’Ok' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ’Offline Installation' పూర్తి అయిన తర్వాత ఈ 'Gmail' షార్ట్ కట్ ని వుపయోగించే మీ మెయిల్ ని ఆఫ్ లైన్ లో యాక్సెస్ చెయ్యవచ్చు.
ఆన్ లైన్ లో మీ మెయిల్ ని ఎలా వుయోగిస్తారో ఆఫ్ లైన్ లో కూడా అలానే వుపయోగించుకోవచ్చు. ఉదా: మీరు ఆఫ్ లైన్ లో మెయిల్ కంపోస్ చేసి పంపిస్తే అది అవుట్ బాక్స్ కి వెళుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన వెంటనే మెయిల్ పంపబడుతుంది.
ధన్యవాదాలు