Monday, February 9, 2009
POP Peeper ని వుపయోగించి ఈ-టపా అలెర్ట్ పొందండి
POP Peeper - ఒక ఈ-టపా నోటిఫైయర్. POP Peeper అనే ఈ వుచిత చిన్న అప్లికేషన్ సిస్టం ట్రే లో రన్ అవుతూ మీ ఈ-మెయిల్ ఎకౌంట్స్ కి ఏదైనా క్రొత్త మెయిల్ వస్తే అలెర్ట్ చేస్తుంది. ఈ సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసిన తర్వాత మీ POP3 లేదా IMAP ఎకౌంట్లను యాడ్ చేసుకోవాలి. ఇది దాదాపు అన్ని ఈ-మెయిల్ ప్రొవైడర్లు అంటే Gmail, Hotmail, Rediffmail, Yahoo మొదలగు వాటిని సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిల్ ఎకౌంట్స్ కాన్ఫిగర్ చేసుకొన్న తర్వాత మీ ఎకౌంట్ కి క్రొత్త మెయిల్ వస్తే ఆడియో సౌండ్, స్క్రీన్ సేవర్, Scroll Lock LED ఫ్లాష్ అయ్యేటట్లు ఇలా అలెర్ట్ పెట్టుకోవచ్చు. ఈ సాప్ట్ వేర్ వుపయోగించి ఈ-మెయిల్ చదవటం లేదా పంపటం చెయ్యవచ్చు. అడ్రస్ బుక్ లో మెయిల్ ఐడి లు సేవ్ చేసుకోవచ్చు. ఇతరులు మీ మెయిల్ అలెర్ట్ లు చూడకుండా పాస్ వార్డ్ లో రక్షించుకోవచ్చు. లిమిట్ అంటూ లేకుండా ఎన్నైనా మెయిల్ ఎకౌంట్స్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఎన్నో సదుపాయాలున్న ఈ సాప్ట్ వేర్ డౌన్ లోడ్ మరియు మరింత సమాచారం కోసం POP Peeper సైట్ ని సందర్శించండి.
ధన్యవాదాలు