Wednesday, February 18, 2009

గాలి నుంచి నీరు!


గాలి నుంచి నీటి ని ఉత్పత్తి చేసే యంత్రం గురించి ఈనాడు దిన పత్రికలో వచ్చిన వివరాలు యధాతదంగా...
అమెరికాకు చెందిన వాటర్ మేకర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నూతన శాస్త్రసాంకేతిక పధ్ధతిలో గాలి నుండి నీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రాన్ని ప్రపంచంలోనే మొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం జాలిముడి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మినరల్ వాటర్ కు ఏమాత్రం తీసిపోని ఈ నీటి వుత్పాదనకు అయ్యే ఖర్చు 25 పైసలేనట. ఏడాదికోమారు ఫిల్టర్లు మార్చుకోవాలి. దీనికి అదనంగా నిర్వహణ కి అయ్యే ఖర్చు ప్రత్యేకంగా ఏమీ వుండదు. ఓ ప్రత్యేకమైన ఎత్తైన స్ధలంలో విద్యుత్తుతో యంత్రం తిరుగుతుంటే ...ట్యాంకుల్లోకి అలా నీరు వచ్చి చేరటం నిజంగా అబ్బురమే. గాలిలోని తేమను ఒడిసిపట్టి నీటిగా మార్చటమే దీని ఫ్రత్యేకత. ఈ యంత్రం ఖరీదు రూ.18 లక్షలు, నిర్వహణకు ఏడాది కి రూ.15 వేల వరకు వుంటుంది. గ్రుహ అవసరాల కోసాం వుపయోగపడే 25 లీటర్ల యంత్రం ధర రూ.40 వేల వరకు వుంటుందట!!!

ధన్యవాదాలు