Thursday, February 19, 2009

DiskDigger - డాటా రికవరీ టూల్

DiskDigger అనే ఉచిత యుటిలిటీ ని ఉపయోగించి ఏదైనా స్టోరేజ్ మీడియా అంటే USB flash drives, memory cards (SD, CompactFlash, Memory Stick, etc), మరియు hard drive ల నుండి తొలగించబడిన లేదా ఫార్మేట్ చెయ్యబడిన ఫైళ్ళను రికవర్ చెయ్యవచ్చు. ఈ యుటిలిటీ డౌన్ లోడ్ జిప్ ఫైల్ సైజ్ 604 KB మాత్రమే. అన్ జిప్ చేసి ఇనస్టలేషన్ చెయ్యకుండా DiskDigger రన్ చేసుకోవచ్చు. DiskDigger విండో లో సిస్టం లోని డ్రైవ్స్ ని చూపిస్తుంది, కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి. సెలెక్ట్ చేసుకున్న డ్రైవ్ ని పూర్తిగా స్కాన్ చేసి రికవర్ చెయ్యగలిగిన ఫైళ్ళ ను ఫోటోలు, డాక్యుమెంట్లు (వార్డ్, ఎక్సెల్, పీడీఎఫ్ మొ.), వీడియోలు /మ్యూజిక్ అని వేరు వేరు క్యాటగిరీ లలో చూపిస్తుంది. రికవర్ చేసుకోదలచిన ఫైల్ పై క్లిక్ చేసి పైన వున్న ’Save' బటన్ పై క్లిక్ చెయ్యాలి.





USB drives లేదా Memory Cards నుండి తొలగించబడిన ఫైళ్ళను రికవర్ చెయ్యటానికి ఈ యుటిలిటీ బాగా వుపయోగపడుతుంది.

మరింత సమాచారం కోసం DiskDigger సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు