Thursday, February 12, 2009
Hard Drive Eraser - డాటా శాశ్వతంగా తొలగించటానికి ఉచిత సాప్ట్ వేర్
మనం హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఫార్మేట్ చేసిన తరువాత కూడా కమర్షియల్ డాటా రికవరీ టూల్స్ ని వుపయోగించి తొలగించబడిన ఫైళ్ళను తిరిగి పొందవచ్చు. Hard Drive Eraser అనే వుచిత సాప్ట్ వేర్ ని వుపయోగించి హార్డ్ డిస్క్ లోని ఫైళ్ళను శాశ్వతంగా తొలగించవచ్చు. ఎక్కువసార్లు మాగ్నెటిక్ సర్ఫేస్ ని అనవసరమైన బైనరీ డాటా తో నింపటం వలన డాటా రికవర్ చెయ్యటం సాధ్యపడదు. సాధారణ ఫార్మేటింగ్ కన్నా ఎక్కువ సమయం పట్టినా డాటాని శాశ్వతంగా తొలగిస్తుంది. ఇది శక్తివంతమైన వుచిత సాప్ట్ వేర్. ఈ సాప్ట్ వేర్ వుపయోగించే విధానం మరియు తీసుకొనవలసిన జాగ్రత్తలు Hard Drive Eraser సైట్ లో చాలా చక్కగా వివరించారు.
ధన్యవాదాలు