Tuesday, February 10, 2009

USB drives ఆటో ప్లే కాకుండా చెయ్యటానికి...

USB drives వలన వైరస్ లు చాలా త్వరగా మరియు సులభం గా మనకు తెలియకుండా మన సిస్టం లోకి చొరబడతాయి. USB drives సిస్టం కి కనెక్ట్ చేసినప్పుడు ఆటో ప్లే అయ్యి ఈ క్రింది విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ’OK' కాకుండా ’Cancel' బటన్ క్లిక్ చెయ్యాలి.



అసలు USB drives ఆటో ప్లే కాకుండా వుండాలంటే ఈ క్రింది విధంగా చెయ్యాలి.
1.Start--> Run కి వెళ్ళి gpedit.msc అని టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.
2.ఇప్పుడు ఓపెన్ అయిన Group Policy విండో లో computer configuration ---> administrative templates --> System పై క్లిక్ చెయ్యాలి. కుడి చేతిప్రక్క వున్న విండో లో Turn off Autoplay పై డబుల్ క్లిక్ చెయ్యాలి.



3.Turn off Autoplay properties లో Enabled సెలెక్ట్ చేసుకొని క్రింద All drives సెలెక్ట్ చేసుకొని ముందుగా Apply తర్వాత Ok బటన్ పై క్లిక్ చెయ్యాలి.


పై విధంగా చెయ్యటం USB drives ఆటో ప్లే కావు మరియు ఆటోమాటిక్ గా రన్ అయ్యే వైరస్ ల నుండి రక్షణ పొందవచ్చు.

చివరగా ఒక్కమాట: వైరస్ ల బారి నుండి పూర్తి రక్షణ కోసం యాంటీ వైరస్ సాప్ట్ వేర్ సిస్టం లో లోడ్ చేసుకొని తరచూ అప్ డేట్ చేసుకొంటూ వుండాలి.

ధన్యవాదాలు