Monday, May 4, 2009

NetVideoHunter - ఏదైనా వీడియో షేరింగ్ సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చెయ్యటానికి....

NetVideoHunter ఫైర్ ఫాక్స్ యాడ్-ఆన్ దీనిని ఉపయోగించి సులభంగా దాదాపు అన్ని వీడియో షేరింగ్ సైట్ల (Youtube, MySpace Music, Google Video, Metacafe, Dailymotion, Break, Putfile, etc...) నుండి వీడియోలు మరియు మ్యూజిక్ డౌన్ లోడ్ చెయ్యవచ్చు.

ముందుగా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ https://addons.mozilla.org/en-US/firefox/addon/7447 లింక్ కి వెళ్ళి NetVideoHunter డౌన్ లోడ్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేస్తే ఫైర్ ఫాక్స్ లో కుడి చేతిప్రక్క మూలన చిన్న ప్లే బటన్ వస్తుంది.



ఇప్పుడు వీడియో షేరింగ్ సైట్ వెళ్ళి కావల్సిన వీడియో పై క్లిక్ చేస్తే ప్లేబటన్ ప్రక్కన నంబర్ వస్తుంది. ఇప్పుడు ప్లేబటన్ పై క్లిక్ చేస్తే మనం చూసిన వీడియో ల లిస్ట్ వస్తుంది అక్కడ వున్న Download బటన్ పై క్లిక్ చేసి కావలసిన వీడియోను సేవ్ చేసుకోవచ్చు.



ధన్యవాదాలు