Thursday, May 21, 2009

ఇంటర్నెట్ షేర్ చెయ్యటానికి ఉత్తమ మరియు ఉచిత ఫ్రాక్సీ...


వివిధ కంప్యూటర్ల మధ్య ఇంటర్నెట్ షేర్ చెయ్యటానికి ఎన్నో ఉచిత ఫ్రాక్సీ సాప్ట్ వేర్లు నెట్ లో లభిస్తాయి... వాటిలో ఒక ఉత్తమ మరియు ఉచిత సాప్ట్ వేర్ Freeproxy . దీనిని ఉపయోగించటం చాలా సులువు దీనిలో Caching Server మరియు Website filter/blocker ఫంక్షన్లు వున్నాయి.

లాన్ సెట్టింగ్స్ క్లుప్తంగా:

౧. ముందుగా Freeproxy ని ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ లో ఇనస్టాల్ చెయ్యాలి.
౨. లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ లో అయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలో ఆ కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తెరచి మెయిన్ మెనూ లోని Tools -> Internet Options -> Connections -> Lan Settings లో ముందుగా Automatically detect settings దగ్గర టిక్ (Select) చెయ్యాలి. తరువాత Use a proxy server for your LAN ను టిక్ చేసి Address దగ్గర ఐపి అడ్రస్ (ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ IP Address)ఎంటర్ చెయ్యాలి, Port దగ్గర 8080 ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు ’ఒకే’...’ఒకే’ ...చెయ్యాలి.

ఇనస్టలేషన్, సెట్టింగ్స్ మరియు ఇతర సమాచారం కోసం Freepry Documentation చూడండి.


ధన్యవాదాలు