కొన్ని పీడీఎఫ్ నుండి వార్డ్ కన్వర్షన్ టూల్స్ లో ఒక్కొక్కసారి జంక్ క్యారక్టర్ లు లేదా టెక్ట్శ్ బాక్స్ లు లేదా సరిగా కన్వర్ట్ కాకపోవటం జరుగుతుంది. అలా కాకుండా PDFtoWord అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి సులభంగా , త్వరగా మరియు యాక్యురేట్ గా పీడీఎఫ్ డాక్యుమెంట్లను వార్డ్ లోకి మార్చుకోవచ్చు. అదీ మూడు స్టెప్పుల్లో....
ముందుగా http://www.pdftoword.com/ సైట్ కి వెళ్ళాలి... తర్వాత క్రింది విధంగా చెయ్యాలి...
స్టెప్ ౧. Step1 లో ’Choose File' పై క్లిక్ చేసి వార్డ్ లోకి కన్వర్ట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౨. Step2 లో .doc లేదా .rtf సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౩. Step3 లో ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేసి 'Convert' పై క్లిక్ చెయ్యాలి, పీడీఎఫ్ కన్వర్ట్ చెయ్యబడి ఫైల్ మన మెయిల్ ఐడి కి పంపబడుతుంది.
మరింత సమాచారం కోసం PDFtoWord సందర్శించండి.
ధన్యవాదాలు