Tuesday, May 5, 2009
Onlinefamily.Norton - ఇంటర్నెట్ లో మీ పిల్లలు ఏమి సర్ఫ్ చేస్తున్నారో తెలుసుకోవటానికి...
తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు ఇంటర్నెట్ లో ఏమి చేస్తున్నారో అని తెలుసుకోవాలని ఉంటుంది, పిల్లలు ఏ సైట్లు చూస్తున్నారు... ఎంతసేపు చూస్తున్నారు... ఎవరితో మాట్లాడుతున్నారు.... ఏ సమాచారం షేర్ చేసుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకోవటానికి Onlinefamily.Norton అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ 01/01/2010 వరకు ఉచితంగా పొందవచ్చు.
1. Register-ముందుగా Onlinefamily.Norton సైట్ కి వెళ్ళి ఈ-మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాలి.
2. Setup-ఇక్కడ పిల్లల వివరాలు ఎంటర్ చేసి ’Add Child' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
3. Install-'Norton Safety Minder' సాప్ట్వేర్ ని డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.
4.Confugure -ఇక్కడ 'Settings' పై క్లిక్ చేసి అక్కడ వున్న సైట్ క్యాటగిరీల్లో పిల్లలు చుడకూడని సైట్లకు సంబంధించిన క్యాటగిరీలను సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే స్పెసిఫిక్ సైట్ అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అలానే అనుమతించే సైట్లను కూడా ఎంటర్ చెయ్యవచ్చు. రోజులో ఎన్నిగంటలు కంప్యూటర్ ఉపయోగించుకోవటానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాల సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం Onlinefamily.Norton సైట్ సందర్శించండి.
ధన్యవాదాలు