Monday, July 19, 2010

Comodo Verification Engine - ఉచిత వెబ్ సైట్ వెరిఫికేషన్ యుటిలిటీ

మనం బ్రౌజ్ చేస్తున్న వెబ్ సైట్ సురక్షితమైనదా మరియు నమ్మదగినదా అని తెలుసుకోవటానికి Comodo Verification Engine అనే ఉచిత సైట్ వెరిఫికేషన్ యుటిలిటీ సహాయపడుతుంది. కొన్ని సైట్లు మనకు తెలియకుండానే మన పీసీ వైరస్ ని చొప్పిస్తాయి మరికొన్ని సైట్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తాయి. అందుకే మనం ఏదైనా సైట్ సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవటం ఎంతైనా అవసరం.

Comodo Verification Engine బ్రౌజర్ ప్లగిన్ ఇది ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్ ఫాక్స్, సీమంకీ మరియు నెట్ స్కేప్ ని సపోర్ట్ చేస్తుంది. కొమోడో సైట్ కి వెళ్ళి వెరిఫికేషన్ ఇంజిన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత Comodo Verification Engine సిస్టం ట్రే లో కూర్చుంటుంది. మనం బౌజర్ లో ఏదైనా సైట్ అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు అది సురక్షితమైనదా కాదో తెలియచేస్తుంది, అడ్రస్ బార్ లో వున్న తాళం గుర్తు పై మౌస్ ని ఉంచితే వెరిఫికేషన్ స్టేటస్ చూపిస్తుంది మరియు సైట్ సరైనదైతే బ్రౌజర్ చుట్టూ పచ్చని బోర్డర్ వస్తుంది. లేకుంటే వార్నింగ్ మెసేజ్ వస్తుంది.




Comodo Verification Engine వైరస్ ల నుండి, మాల్వేర్ల , యాడ్ వేర్ల నుండి పీసీ ని కాపాడుతుంది. దీనిలో యాంటీ ఫిషింగ్ సాప్ట్ వేర్ వుంది అది ఫిషింగ్ అటాక్స్ నుండి కాపాడుతుంది.

డౌన్లోడ్: Comodo Verification Engine

ధన్యవాదాలు