Thin Client టెక్నాలజీ మాదిరి గానే NComputing Inc. వారు ఈధర్నెట్ వర్చువల్ డివైస్ ని రూపొందించారు. ఈ వర్చువల్ డెస్క్ టాప్ లో మోనిటర్, కీబోర్డ్, మౌస్ మరియు L 300 డివైజ్ వుంటాయి. అవసరం అనుకొంటే L 300 డివైజ్ కి USB ఆధాతిత డివైజ్ లు, స్పీకర్లు మరియు మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక డెస్క్ టాప్ తీసుకోవాలి, దాని CPU తో వర్చువల్ డెస్క్ టాప్ ని అను సంధానం చెయ్యటం ద్వారా ఆ CPU లోని అప్లికేషన్లన్నీ ఈ వర్చువల్ డెస్క్ టాప్ లో పొందవచ్చు. ఇలా ఒకే CPU కి L300 డివైజ్ సహాయం తో 30 వర్చువల్ డెస్క్ టాప్ లు కనెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు అన్నీ ఒకే చోట వుంటాయి. మెయింటెనెన్స్ భారం మరియు ఖర్చు తగ్గుతాయి. నెట్ సెంటర్లు, కాల్ సెంటర్లు, స్కూల్, కాలేజ్ మరియు చిన్న/ మధ్యతరహా కార్యాలయాలలో ఈ వర్చువల్ డెస్క్ టాప్ లను ఉపయోగించవచ్చు.
NComputing L300 ఈథర్నెట్ వర్చువల్ డెస్క్ టాప్ కి సంబందించిన వీడియో:
మరింత సమాచారం కోసం NCompting సైట్ చూడండి.
ధన్యవాదాలు