Wednesday, July 7, 2010

RecoveryDesk - సిస్టం నుండి తొలగించబడిన ఫైళ్ళను తిరిగిపొందటానికి...

హార్డ్ డిస్క్ (NTFS, FAT12, FAT16, FAT32 పార్టీషన్లు) మరియు రిమూవబుల్ మీడియా(SD, CF, MS, MMC, Flash Card, USB drive) నుండి తొలగించబడిన ఫైళ్ళను తిరిగిపొందటానికి RecoveryDesk అనే ఉచిత చిన్న మరియు సమర్ధవంతమైన డాటా రికవరీ టూల్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించటం చాలా సులువు. ముందుగా RecoveryDesk సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ని రన్ చేసినప్పుడు 'Windows Explorer' లాంటి ఇంటర్ ఫేస్ ని కలిగి వుంటుంది. ’Scan' లేదా ’Full Scan' పై క్లిక్ చెయ్యటం ద్వారా డిలీట్ చెయ్యబడిన ఫైళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. కావలసిన డ్రైవ్ లేదా ఫోల్డర్ ని కూడా స్కాన్ చేసుకోవచ్చు. రికవర్ చెయ్యవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకొని Recover బటన్ ని ప్రెస్ చెయ్యాలి. రికవర్ చేసే ఫైళ్ళను అదే డ్రైవ్ లో రీస్టోర్ చెయ్యటం వలన్ ఫైల్ స్ట్రక్చర్ దెబ్బతినే అవకాశం వుంది లేదా సరిగ్గా ఫైల్ రికవర్ కాకపోవచ్చు. కాబట్టి నెట్ వర్క్ లోని వేరొక సిస్టం లేదా USB డ్రైవ్ లలో ఫైల్/ఫోల్డర్ రీస్టోర్ చేసుకోవటం ఉత్తమం.



RecoveryDesk విండోస్ 2000/XP/2003/2008/Vista/7 లలో పని చేస్తుంది.

డౌన్లోడ్: RecoveryDesk (సైజ్: 878 Kb)

ధన్యవాదాలు