పీసీ ఆన్ చెయ్యగానే రోజూ రెగ్యులర్ గా కొన్ని పనులు చేస్తూవుంటాం ... మెయిల్ చెక్ చేసుకోవటం , నచ్చిన సైట్ చూడటం, పాటలను ప్లే చెయ్యటం ... రోజూ ఓపెన్ చెయ్యవలసిన అప్లికేషన్లను, వెబ్ సైట్లను లేదా మ్యూజిక్ ఆటోమాటిక్ గా ఓపెన్ చెయ్యటానికి Start My Day అనే ఉచిత అప్లికేషన్ సహాయపడుతుంది. ఇది విండోస్ విస్టా మరియు 7 కోసం రూపొందించబడినది. Start My Day లో వున్న Apps, Web, Music టాబ్స్ లో కావసిన అప్లికేషన్/వెబ్ లింక్స్/ పాటలను డ్రాగ్ అండ్ డ్రాప్ పధ్ధతిలో జత చెయ్యవచ్చు. ఇక్కడ జత చెయ్యబడిన అప్లికేషన్లు అలారమ్ క్లాక్ ని ఉపయోగించి ఆటోమాటిక్ గా లోడ్ అవుతాయి. ఆటోమాటిక్ గా వద్దనుకొంటే లిస్ట్ లోని వాటిని మాన్యువల్ గా కూడా రన్ చేసే సదుపాయం వుంది. అప్లికేషన్ లిస్ట్ లో .exe ఫైళ్ళను, వెబ్ లిస్ట్ లో .url ఫైళ్ళను మరియు మ్యూజిక్ లిస్ట్ లో .MP3 ఫైళ్ళను మాత్రమే అనుమతిస్తుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: Start My Day
ధన్యవాదాలు