Tuesday, July 13, 2010

FamilyShield - అడల్ట్ వెబ్ సైట్లను పిల్లలు చూడకుండా బ్లాక్ చెయ్యటానికి...

అడల్ట్ వెబ్ సైట్లను పిల్లలు చూడకుండా OpenDNS ఉపయోగించి ఎలా బ్లాక్ చెయ్యాలో ఒంతకు ముందు చేసిన OpenDNS పోస్ట్ ని ఇక్కడ చూడండి. OpenDNS నుండి వచ్చిన సింపుల్ సొల్యూషనే/వెర్షనే FamilyShield.

FamilyShield సెటప్ గురించి ఇప్పుడు చూద్దాం:

ముందుగా FamilyShield సైట్ కి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే కనుక Continue without signing up దగ్గర క్లిక్ చేస్తే FamilyShield సెటప్ Router లేదా Computer లలో దేనిలో సెట్ చెయ్యాలో దానిని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా దానికి సంబంధించిన సూచనలు వస్తాయి. Computer అని సెలెక్ట్ చేసుకొంటే కనుక తర్వాత వచ్చే పేజీలో మన పీసీ ఆపరేటింగ్ సిస్టం ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొన్న తర్వాత FamilyShield ఎలా కాన్ఫిగర్ చెయ్యలో స్టెప్ బై స్టెప్ ఇనస్ట్రక్షన్లు చాలా చక్కగా వివరించారు. దానిని ఫాలో అయితే సరిపోతుంది. సెట్టింగ్స్ పూర్తి అయిన తర్వాత సైట్ లో Test Your New Settings పై క్లిక్ చేసి మనం చేసిన సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా తెలుస్తుంది.

FamilyShield సంబంధించిన వీడియో డిజిటల్ ఇన్స్పిరేషన్ నుండి:


వెబ్ సైట్: FamilyShield

ధన్యవాదాలు