Friday, July 2, 2010

USB Write Protect - USB డ్రైవ్ లు వైరస్ ల బారిన పడకుండా కాపాడటానికి!!!

USB డ్రైవ్ లు సులభంగా వైరస్ ల బారిన పడతాయి. USB డ్రైవ్ లను ఏదైనా పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు వైరస్ లు దానిలోకి ప్రవేశించకుండా USB Write Protect అనే ఉచిత యుటిలిటీ ని ఉపయోగించి write protect చెయ్యవచ్చు. అంతేకాకుండా పొరపాటున డాటా డిలీట్ లేదా మాడిఫై చెయ్యటాన్ని కూడా అరికట్టవచ్చు. USB Write Protect ఒక చిన్న ఉచిత యుటిలిటీ, జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత అన్ జిప్ చేసి USBWriteProtect ఫైల్ ని USB drive లోకి కాపీచేసుకొని తర్వాత దానిపై డబల్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు. USBWriteProtect ఓపెన్ అయిన తర్వాత Protection దగ్గర వున్న రెండు ఆప్షన్లలో Enable Write Protect ని సెలెక్ట్ చేసుకొని Apply బటన్ క్లిక్ చేసేముందు ఒకసారి USB drive ని తొలగించి తిరిగి మరల కనెక్ట్ చెయ్యాలి.



ఇప్పుడు Apply బటన్ పై క్లిక్ చేసి చివరగా Close బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే మీ USB Drive write protect చెయ్యబడింది ఇప్పుడు దీనిలో క్రొత్త ఫైల్/ఫోల్డర్ క్రియేట్ లేదా కాపీ చెయ్యలేము.

write protect డిసేబుల్ చెయ్యటానికి కూడా పైన చెప్పిన పద్ధతే. Disable Write Protect ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని USB Drive తొలగించి తిరిగి కనెక్ట్ చేసి Apply బటన్ పై క్లిక్ చెయ్యాలి.

డౌన్లోడ్: USB Write Protect (సైజ్ : 11KB)

ధన్యవాదాలు