మనం ఏదైనా వెబ్ సైట్ చూస్తున్నప్పుడు దానిలో ఏదైనా ఆసక్తికరమైన విషయం కనబడితే ఆ టెక్స్ట్ ని హైలైట్ చేసి వెంటనే మిత్రులతో పంచుకోవటానికి Webklipper అనే సైట్ ఉపయోగపడుతుంది. దీంతో అవతలి వాళ్ళు మొత్తం పేజీ చదవకుండా హైలెట్ చేసింది మాత్రమే చదవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం:
౧. ముందుగా Webklipper సైట్ కి వెళ్ళి http:// దగ్గర కావలసిన వెబ్ సైట్ అడ్రస్ ఎంటర్ చేసి Klip It పై క్లిక్ చెయ్యాలి.

౨. ఇప్పుడు మనకి కావలసిన వెబ్ సైట్ ఓపెన్ అయ్యి Webklipper లోడ్ అవుతుంది, పేజీ అడుగున Webklipper టూల్ బార్ వస్తుంది.

౩. ఇప్పుడు కావలసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని క్రిందవున్న Highlight పై క్లిక్ చెయ్యాలి. ఇదేవిధంగా పేజ్ మొత్తం లో హైలైట్ చెయ్యవలసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అవసరమైతే కామెంత్లము కూడా జత చెయ్యవచ్చు.


౪. ఇప్పుడు ’Save' బటన్ పై క్లిక్ చెయ్యాలి తర్వాత ప్రక్కనే వున్న ’Share' పై క్లిక్ చేసి మిత్రులకు ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు.

ధన్యవాదాలు