Thursday, July 15, 2010

Comodo నుండి ఉపయోగపడే ఉచిత సాప్ట్ వేర్లు...

Creating Trust online నినాదంతో ఎంతో ఉపయోగకరమైన సాప్ట్ వేర్లను Comodo మనకు ఉచితంగా అందిస్తుంది. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం...ఇవి అందరకీ తెలిసినవి అయినా ఒక్కసారి మననం చేసుకుందాం!!!

1. Comodo Dragon:

క్రోమ్ ఆధారిత వేగవంతమైన మరియు సెక్యూరిటీ / ఫ్రైవసీ ఫీచర్లు కలిగిన ఇంటర్నెట్ బ్రౌజర్. ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా స్టాక్ ట్రేడింగ్ చేసే వారు Dragon ఉపయోగించటం ఉత్తమమం. Comodo Dragon పై మరింత సమాచారం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Comodo Dragon

2. Comodo Time Machine:

పీసీ సరిగా పనిచెయ్యనప్పుడు తిరిగి దానిని సరిగ్గా పనిచేసిన రోజుకు తిరిగి రీస్టోర్ చెయ్యటానికి Comodo Time Machine ఉపయోగపడుతుంది. విండోస్ సిస్టం టూల్స్ లో వచ్చే Sysytem Restore కి సరైన ప్రత్యామ్నాయం. Time Machine పై మరింత సమాచారం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Comodo Time Machine

3. Comodo Free Antivirus:
ఉచిత యాంటీ వైరస్ సాప్ట్ వేర్లలో ఇది కూడా ఒక ఉత్తమమైన మరియు ప్రభావంతమైన యాంటీవైరస్.
డౌన్లోడ్: Comodo Free Antivirus

4. Comodo Firewall:
పీసీ లో ప్రవేశించే అన్ ఆధరైజ్ద్ ఎంట్రీల నుండి ఫైర్ వాల్ కాపాడుతుంది. పర్సనల్ ఫైర్ వాల్ సాప్ట్ వేర్ల లో COMODO Personal Firewall బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిపై మరింత సమాచారం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: Comodo Firewall

5. Comodo Backup:
ఏదైనా కారణాల వలన డాటా పోకుండా/కరప్ట్ కాకుండా సురక్షితంగా వుండాలంటే తరచూ బ్యాక్ అప్ తీసుకుంటూ వుండాలి. సాధారణంగా మనం మాన్యువల్ గా కావలసిన ఫైల్స్/ఫోల్డర్ లను హార్డ్ డిస్క్ లేదా స్టోరేజ్ డివైస్ లో తీసుకుంటాం. ఒక్కొక్కసారి మరచిపోతాం ...ఫైల్ లాస్/కరప్ట్ అయిన తర్వాత అయ్యో ముందే బ్యాక్ అప్ తీసుకుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. అలా జరగకుండా ఒక షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఆటోమాటిక్ బ్యాక్ అప్ తీసుకోవటానికి నెట్ లో ఎన్నో వుచిత టూల్స్ లభిస్తున్నాయి. వాటిలో ఉత్తమమైనది Comodo Backup.
డౌన్లోడ్: Comodo Backup

6. Comodo System Cleaner:
పీసీ పేరుకుపోయిన టెంపరరీ ఫైళ్ళను తొలగించి దాని పనితనాన్ని మెరుగు పర్చటానికి Comodo System Cleaner ఉపయోగపడుతుంది. దీనిపై మరింత సమాచారం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్:Comodo System Cleaner


7. Comodo Secure Email Encryption:
మెయిల్స్ ఎవరూ చదవకుండా వాటిని ఎన్ క్రిప్టెడ్ ఫార్మ్ లో సురక్షితంగా పంపటానికి ఈ యుటిలిటీ ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్: Comodo Secure Email Encryption

8. Comodo EasyVPN:
మీ స్వంత మరియు మిత్రుల పీసీ లతో స్వంత వర్చువల్ ఫ్రైవేట్ నెట్వర్క్ (VPN) క్రియేట్ చేసుకోవటానికి Comodo EasyVPN ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్: Comodo EasyVPN

9. Comodo Disk Encryption:
డిస్క్ లోని డాటాని ఎన్ క్రిప్ట్ చెయ్యటానికి Comodo Disk Encryption ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్: Comodo Disk Encryption

ధన్యవాదాలు